తెలంగాణ కేబినెట్‌లో మార్పులు..! వేటు పడే ఆ ఇద్దరు వీరేనా ?

తెలంగాణ మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. రాష్ట్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ అంటూ వస్తున్న వార్తలతో తెలంగాణ మంత్రుల్లో ఆందోళన మొదలైంది. ఎవరి పదవి ఉంటుందో….ఎవరి పదవి ఊడుతుందో తెలియని పరిస్థితి. అయితే ఈసారి ఇద్దరిపై వేటు ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరి ఆ ఇద్దరు మంత్రులెవరు ? గులాబీ బాస్‌ మనసులో ఏముంది? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీలో ఊపందుకున్న చర్చ. ఉంటామా? పోతామా? తెలంగాణ మంత్రులకు తెగ టెన్షన్‌ పట్టుకుంది కేబినెట్ […]

తెలంగాణ కేబినెట్‌లో మార్పులు..! వేటు పడే ఆ ఇద్దరు వీరేనా ?
Rajesh Sharma

|

Nov 12, 2019 | 1:59 PM

తెలంగాణ మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. రాష్ట్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ అంటూ వస్తున్న వార్తలతో తెలంగాణ మంత్రుల్లో ఆందోళన మొదలైంది. ఎవరి పదవి ఉంటుందో….ఎవరి పదవి ఊడుతుందో తెలియని పరిస్థితి. అయితే ఈసారి ఇద్దరిపై వేటు ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరి ఆ ఇద్దరు మంత్రులెవరు ? గులాబీ బాస్‌ మనసులో ఏముంది? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీలో ఊపందుకున్న చర్చ.

ఉంటామా? పోతామా? తెలంగాణ మంత్రులకు తెగ టెన్షన్‌ పట్టుకుంది కేబినెట్ పునర్వ్యవస్థీకరణ వార్తలతో. ప్రక్షాళన వార్తలతో వారిలో గుబులు మరింత పెరిగింది. తెలంగాణ మంత్రవర్గ పునర్‌ వ్యవస్థీకరణ ఉంటుందని మళ్లీ ప్రచారం మొదలైంది. ఈ వార్తలు ఇప్పుడు 16 మంది మంత్రులను టెన్షన్‌ పెడుతున్నాయ్. దీంతో పాత మంత్రుల్లో ఎవరి సీటు ఉంటుందో.. ఎవరి సీటు ఊడుతుందో అనే భయం పట్టుకుంది.

మంత్రవర్గం నుంచి ఇద్దరికి ఉద్వాసన పలుకుతారని గులాబీ దళంలో తెగ ప్రచారమవుతోంది. ఇద్దరిని పక్కనబెట్టి…కొత్తగా మరో ఇద్దరిని తీసుకుంటారనే ప్రచారం కొందరు మంత్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కేబినెట్‌లో నలుగురు మంత్రులు ఉన్నారు. జిల్లాలో ఈటెల రాజేందర్‌కు చెక్‌ పెట్టేందుకే గంగుల కమలాకర్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారనే ప్రచారం నడిచింది. అయితే కేబినెట్‌ విస్తరణ టైమ్‌లో ఎవ్వరిని డిస్టర్బ్‌ చేయలేదు. అయితే కరీంనగర్‌లో జిల్లాలో నలుగురు మంత్రుల్లో ఒకరిని తొలగిస్తారని ప్రచారం జరుగుతోంది.

ఇక గ్రేటర్ హైదరాబాద్ నుండి కూడా నలుగురు మంత్రులు ఉన్నారు.. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి నుండి సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి ఉండగా సబితాను తీసుకున్నప్పుడే మల్లారెడ్డి ఔట్ అనుకున్నారు..కానీ అప్పుడు ఆయన్ని కూడా సీఎం టచ్ చెయ్యలేదు. కానీ తాజాగా ఆ మంత్రి పై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఫిర్యాదులు ఎక్కువ అయ్యాయి. దీంతో ఉద్వాసన జాబితాలో ఆయన పేరు కూడా ఉండచ్చు అనే ప్రచారం పార్టీలో జోరందుకుంది.

కొత్తగా నిజామాబాద్, నల్గొండ జిల్లాల నుండి కొత్తవారికి ఛాన్స్ ఉన్నట్టు పార్టీ వర్గాల్లో న్యూస్‌ వైరల్‌ అవుతోంది. నల్గొండ మంత్రిలో కూడా టెన్షన్ పట్టుకుంది.. హుజుర్‌నగర్ ఉప ఎన్నిక ఇంచార్జి గా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సక్సెస్ అవ్వడం తో మంత్రి పదవి దక్కే వారిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి పెరు కూడా తెరపైకి వచ్చింది. మొత్తంగా మరో కొద్ది నెలల్లో సీఎం చేపట్టే కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ వార్తల నేపథ్యంలో తెలంగాణ మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. ఎవరీ పదవి ఉంటుందో..ఎవరి పదవి ఊడుతుందో అనే లెక్కలు వేసుకుంటున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu