అక్కడా రాంగ్ సిగ్నల్: బంగ్లాలో రెండు రైళ్లు ఢీ..!
బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కస్బా ప్రాంతంలోని మండో బాగ్ స్టేషన్ వద్ద ఈ రెండు రైళ్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో.. 15 మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొంత మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఢాకా వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ఎదురుగా.. చిట్టగాంగ్ వైపు వస్తున్న మరో రైలును వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో రైలు బోగీలు అదుపు తప్పి.. పక్కకు ఒరిగాయి. ఈ ప్రమాద […]
బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కస్బా ప్రాంతంలోని మండో బాగ్ స్టేషన్ వద్ద ఈ రెండు రైళ్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో.. 15 మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొంత మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఢాకా వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ఎదురుగా.. చిట్టగాంగ్ వైపు వస్తున్న మరో రైలును వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో రైలు బోగీలు అదుపు తప్పి.. పక్కకు ఒరిగాయి. ఈ ప్రమాద ఘటనతో ఒకేసారి అక్కడి ప్రయాణికులు భయాందోళన చెందారు. వెంటనే.. ప్రమాదఘటన ప్రాంతానికి రైల్వే పోలీసులు చేరి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాగా.. సిగ్నల్స్ తప్పిదం వల్లే.. రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వచ్చినట్టు సమాచారం. ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పందించి విచారణ వ్యక్తం చేసింది. ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించింది. మిగిలిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అయితే.. ఇలాంటి ప్రమాదమే.. హైదరాబాద్‌లో జరిగింది. నిన్నటికి నిన్న రాంగ్ సిగ్నల్స్ కారణంగా.. ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్, ఎంఎంటీఎస్ ట్రైన్లు ఢీ కొన్న సంగతి తెలిసిందే.