బుల్లెట్లు.. షాహీన్ బాగ్.. బిర్యానీ.. యోగి ఆదిత్యనాథ్ కౌంటర్.. !

సీఏఏకి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ వద్ద ధర్నా చేస్తున్నవారిపైన, సీఎం అరవింద్ కేజ్రీవాల్ పైన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిప్పులు చెరిగారు. ఈ ఆందోళనకారులకు కేజ్రీవాల్ ప్రభుత్వం బిర్యానీ సప్లయ్ చేస్తోందని, వారికి వెన్నుదన్నుగా నిలుస్తోందని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ నగరంలో పలుచోట్ల బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన ఆయన.. కాశ్మీర్లో టెర్రరిస్టులకు మద్దతునిస్తున్నవారే ఈ ధర్నాకు దిగారని , ‘ ఆజాదీ’ అంటూ నినాదాలు చేస్తున్నారని […]

బుల్లెట్లు.. షాహీన్ బాగ్.. బిర్యానీ.. యోగి ఆదిత్యనాథ్ కౌంటర్.. !

సీఏఏకి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ వద్ద ధర్నా చేస్తున్నవారిపైన, సీఎం అరవింద్ కేజ్రీవాల్ పైన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిప్పులు చెరిగారు. ఈ ఆందోళనకారులకు కేజ్రీవాల్ ప్రభుత్వం బిర్యానీ సప్లయ్ చేస్తోందని, వారికి వెన్నుదన్నుగా నిలుస్తోందని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ నగరంలో పలుచోట్ల బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన ఆయన.. కాశ్మీర్లో టెర్రరిస్టులకు మద్దతునిస్తున్నవారే ఈ ధర్నాకు దిగారని , ‘ ఆజాదీ’ అంటూ నినాదాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వారి పూర్వీకులు ఈ దేశాన్ని విడగొట్టారని, ఏక్ భారత్ పేరిట ఈ దేశం అభివృధ్ది చెందడాన్ని వారు సహించలేకపోతున్నారని విమర్శించారు. ఢిల్లీవాసులు తమకు మంచి ఆరోగ్యం, మంచి విద్య, మెట్రో సర్వీసులు కావాలో, షాహీన్ బాగ్ కావాలో తేల్చుకోవాలన్నారు. మోదీ ప్రధాని అయ్యాక ప్రతి ఉగ్రవాదిని గుర్తిస్తున్నారని, వారికి బిర్యానీ బదులు.. ‘గోలీ'(తూటా) తో కూడిన ‘ఆహారాన్ని’ ఇస్తున్నారని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఈ నగరవాసులకు కనీసం మంచినీటిని కూడా ఇవ్వలేకపోతున్నారని ఆయన ఆరోపించారు. షాహీన్ బాగ్ వద్ద ఆందోళన చేస్తున్నవారు సీఏఏకి వ్యతిరేకంగా కాక, ఈ దేశం అభివృధ్దిని అడ్డుకునేందుకే ధర్నాకు కూర్చున్నారని యోగి మండిపడ్డారు.

Published On - 11:44 am, Mon, 3 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu