తిరుమలలో మరోసారి కొరవడిన నిఘా వైఫల్యం
శ్రీవారి కొండపై మరోసారి నిఘా వైఫల్యం బయట పడింది. అలిపిరి చెక్ పోస్ట్ వద్ద భద్రతా సిబ్బంది తనిఖీలలో లోపాలు బయటపడ్డాయి. పంజాబ్‌కు చెందిన భక్త బృందం నిషేధిత వస్తువులతో తిరుమలకు చేరుకున్నారు. శేషాద్రి నగర్ కాటేజీలలోని 315వ గదిని తీసుకున్న భక్తులు అతిధిగృహంలోనే యదేచ్ఛగా హుక్కాను పీలుస్తూ ఎంజాయ్ చేశారు. పక్క గదిలోని భక్తులకు అనుమానం వచ్చి సమీపంలోని స్థానికులు సమాచారం ఇవ్వగా వారు వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో గది వద్దకు […]
శ్రీవారి కొండపై మరోసారి నిఘా వైఫల్యం బయట పడింది. అలిపిరి చెక్ పోస్ట్ వద్ద భద్రతా సిబ్బంది తనిఖీలలో లోపాలు బయటపడ్డాయి. పంజాబ్‌కు చెందిన భక్త బృందం నిషేధిత వస్తువులతో తిరుమలకు చేరుకున్నారు. శేషాద్రి నగర్ కాటేజీలలోని 315వ గదిని తీసుకున్న భక్తులు అతిధిగృహంలోనే యదేచ్ఛగా హుక్కాను పీలుస్తూ ఎంజాయ్ చేశారు. పక్క గదిలోని భక్తులకు అనుమానం వచ్చి సమీపంలోని స్థానికులు సమాచారం ఇవ్వగా వారు వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో గది వద్దకు చేరుకున్న పోలీసులు భక్తుల వద్ద వున్న హుక్కాతో పాటు ద్రవపదార్ధాల బాటిళ్లను స్వాధీనం చేసుకుని భక్తులను స్టేషన్‌కు తరలించారు. తిరుమలకు పొగాకు సంబంధించిన పదార్థాలను తీసుకురావడంపై కేసు నమోదు చేస్తామని సీఐ వెంకటేశ్వరులు తెలిపారు. అయితే గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నా భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం మాత్రం వీడకపోవడంతో శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.