ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌లో డ్యాన్స్‌తో అదగొట్టిన సాయేషా
‘అఖిల్’ మూవీ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సాయేషా సైగల్, కోలీవుడ్ నటుడు ఆర్యను వివాహం చేసుకోబోతుంది. ఇరు కుటుంబాల సమక్షంలో ఆదివారం వీరిద్దరి వివాహ వేడుక హైదరాబాద్‌లో జరగబోతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ సెలబ్రిటీలు సంజయ్ దత్, ఆదిత్యా పంచోలీ, ఖుషి కపూర్ తదితరులు సందడి చేశారు. ఈ సందర్భంగా గులాబి రంగు లెహంగా వేసుకున్న సాయేషా డ్యాన్స్‌తో అదరగొట్టింది. దానికి సంబంధించిన ఓ […]
‘అఖిల్’ మూవీ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సాయేషా సైగల్, కోలీవుడ్ నటుడు ఆర్యను వివాహం చేసుకోబోతుంది. ఇరు కుటుంబాల సమక్షంలో ఆదివారం వీరిద్దరి వివాహ వేడుక హైదరాబాద్‌లో జరగబోతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ సెలబ్రిటీలు సంజయ్ దత్, ఆదిత్యా పంచోలీ, ఖుషి కపూర్ తదితరులు సందడి చేశారు.
ఈ సందర్భంగా గులాబి రంగు లెహంగా వేసుకున్న సాయేషా డ్యాన్స్‌తో అదరగొట్టింది. దానికి సంబంధించిన ఓ వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. కాగా గజినీకాంత్(భలే భలే మగాడివోయ్ తమిళ రీమేక్)లో కలిసి నటించిన ఆర్య, సాయేషా అప్పటి నుంచి ప్రేమలో ఉన్నారు. ఈ ఏడాది ప్రేమికుల రోజున తమ బంధంపై నోరు విప్పిన ఈ జంట వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
https://www.instagram.com/p/BuwTCIMAGyy/