‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పక్కా హిట్, నాగబాబు జోస్యం

రామ్ గోపాల్ వర్మ అంటే వ్యక్తిగతంగా గౌరవం లేదని, కాని ఆయన తీస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంపై మాత్రం నమ్మకం ఉందని నటుడు నాగబాబు వ్యాఖ్యానించారు. తాను ‘కథానాయకుడు’, ‘యాత్ర’ సినిమాలు చూడలేదని చెప్పారు. ఓ వెబ్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన నాగబాబు, “వర్మపై గౌరవం అంటే నెవర్… నేను కామెంట్ కూడా చేయను. ‘బట్ ఐ నెవర్ డిజ్ రెస్పెక్ట్ హిమ్ యాజ్ ఏ డైరెక్టర్’ అని వ్యాఖ్యానించారు. డైరెక్టర్ గా ఎన్ని ఫెయిల్యూర్స్ […]

'లక్ష్మీస్ ఎన్టీఆర్' పక్కా హిట్, నాగబాబు జోస్యం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 09, 2019 | 2:40 PM

రామ్ గోపాల్ వర్మ అంటే వ్యక్తిగతంగా గౌరవం లేదని, కాని ఆయన తీస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంపై మాత్రం నమ్మకం ఉందని నటుడు నాగబాబు వ్యాఖ్యానించారు. తాను ‘కథానాయకుడు’, ‘యాత్ర’ సినిమాలు చూడలేదని చెప్పారు. ఓ వెబ్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన నాగబాబు, “వర్మపై గౌరవం అంటే నెవర్… నేను కామెంట్ కూడా చేయను. ‘బట్ ఐ నెవర్ డిజ్ రెస్పెక్ట్ హిమ్ యాజ్ ఏ డైరెక్టర్’ అని వ్యాఖ్యానించారు.

డైరెక్టర్ గా ఎన్ని ఫెయిల్యూర్స్ తీసినా, అతనిలో ఉన్న ఎబిలిటీస్ మీద నేనెప్పుడూ తప్పుగా మాట్లాడను. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’… దీనిపై నేను వ్యక్తిగతంగా చెబుతున్నా… రామారావు గారి జీవితంలో ఒడిదుడుకులు లేవండీ… హీ ఈజ్ ఆల్ వేస్ ఏ సక్సెస్ ఫుల్ హీరో. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కష్టాలు మొదలయ్యాయి. రామ్ గోపాల్ వర్మ తీసుకున్న పాయింట్ అక్కడి నుంచి కాబట్టి, కొంత ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ దానిలో ఉంటుందని నా నమ్మకం. అందుకని అది బాగా ఉంటుందని అనుకుంటున్నా” అని అన్నారు. ఈ సినిమా పక్కాగా హిట్ అవుతుందని భావిస్తున్నట్టు తెలిపారు.