ముందుగా రాబోతున్న ‘కళంక్’
బాలీవుడ్‌లో తెరకెక్కిన మరో భారీ బడ్జెట్ పీరియాడిక్ చిత్రం ‘కళంక్’. సంజయ్ దత్, వరుణ్ ధావన్, ఆదిత్య రాయ్ కపూర్, మాధురీ దీక్షిత్, అలియా భట్, సోనాక్షి సిన్హా ఇందులో కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రధాన తారాగణం ఫస్ట్‌లుక్‌లు అందరినీ ఆకట్టుకోగా సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీని ముందుగానే విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావించారు. ఈ నేపథ్యంలో ముందుగా ప్రకటించినట్లు ఏప్రిల్ 19న కాకుండా 17నే రిలీజ్ […]
బాలీవుడ్‌లో తెరకెక్కిన మరో భారీ బడ్జెట్ పీరియాడిక్ చిత్రం ‘కళంక్’. సంజయ్ దత్, వరుణ్ ధావన్, ఆదిత్య రాయ్ కపూర్, మాధురీ దీక్షిత్, అలియా భట్, సోనాక్షి సిన్హా ఇందులో కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రధాన తారాగణం ఫస్ట్‌లుక్‌లు అందరినీ ఆకట్టుకోగా సినిమాపై అంచనాలు పెరిగాయి.
ఈ నేపథ్యంలో ఈ మూవీని ముందుగానే విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావించారు. ఈ నేపథ్యంలో ముందుగా ప్రకటించినట్లు ఏప్రిల్ 19న కాకుండా 17నే రిలీజ్ చేయనున్నట్లు టీం అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ మూవీ టీజర్‌ను మార్చి 12న విడుదల చేయనున్నట్లు తెలిపింది. కాగా అభిషేక్ వర్మన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, సాజిద్ నడియావాలా, రిలియన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.