పాక్‌ డ్రోన్‌ను కూల్చేసిన బీఎస్‌ఎఫ్‌

రాజస్థాన్ : భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్థాన్ డ్రోన్‌ ను బీఎస్‌ఎఫ్‌ పేల్చేసింది. శనివారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో శ్రీగంగానగర్‌ సమీపంలోని హిందూమల్‌కోట్ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు గుండా ఓ డ్రోన్ ప్రవేశించింది. డ్రోన్ రాకను పసిగట్టిన భారత భద్రతా దళాలు వెంటనే డ్రోన్ ను పేల్చేశాయి. కాగా బాలాకోట్ దాడి అనంతరం.. సరిహద్దులోని భారత భూభాగంలో పరిస్థితిని తెలుసుకునేందుకు పాక్ డ్రోన్లను పంపిస్తోందని సైన్యం అనుమానిస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో సర్జికల్ దాడుల తర్వాత […]

పాక్‌ డ్రోన్‌ను కూల్చేసిన బీఎస్‌ఎఫ్‌
Follow us

| Edited By:

Updated on: Mar 09, 2019 | 4:49 PM

రాజస్థాన్ : భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్థాన్ డ్రోన్‌ ను బీఎస్‌ఎఫ్‌ పేల్చేసింది. శనివారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో శ్రీగంగానగర్‌ సమీపంలోని హిందూమల్‌కోట్ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు గుండా ఓ డ్రోన్ ప్రవేశించింది. డ్రోన్ రాకను పసిగట్టిన భారత భద్రతా దళాలు వెంటనే డ్రోన్ ను పేల్చేశాయి. కాగా బాలాకోట్ దాడి అనంతరం.. సరిహద్దులోని భారత భూభాగంలో పరిస్థితిని తెలుసుకునేందుకు పాక్ డ్రోన్లను పంపిస్తోందని సైన్యం అనుమానిస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో సర్జికల్ దాడుల తర్వాత పాక్ డ్రోన్ ఒకటి గుజరాత్‌లోని కచ్ సరిహద్దు వెంబడి ఉన్న నలియా స్థావరం సమీపంలోకి ప్రవేశించగా సైన్యం దాన్ని కూల్చివేసింది. మార్చి 4న కూడా రాజస్థాన్‌లోని బికనీర్ సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ ప్రవేశించగా భద్రతా బలగాలు సుఖోయ్-30 యుద్ధ విమానంతో కూల్చివేశాయి. ఇప్పుడు ఇది మూడో డ్రోన్ అని అధికారులు తెలిపారు.

Latest Articles
నంద్యాల జిల్లాలో వర్షం, వడగండ్ల వాన బీభత్సం.. పక్షులు విలవిల
నంద్యాల జిల్లాలో వర్షం, వడగండ్ల వాన బీభత్సం.. పక్షులు విలవిల
ఐటీఆర్‌ ఫైల్‌ చేసే ముందు గృహ రుణ ప్రయోజనాలు.. రూ.7 లక్షలు ఆదా
ఐటీఆర్‌ ఫైల్‌ చేసే ముందు గృహ రుణ ప్రయోజనాలు.. రూ.7 లక్షలు ఆదా
ఆస్తమా పేషెంట్స్ ఏది తినాలి..? ఏ ఆహారాలకు దూరంగా ఉండాలంటే
ఆస్తమా పేషెంట్స్ ఏది తినాలి..? ఏ ఆహారాలకు దూరంగా ఉండాలంటే
అమ్మబాబోయ్.. ఇదేం అరాచకం..
అమ్మబాబోయ్.. ఇదేం అరాచకం..
ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోడీ..రాఖీ కట్టిన వృద్ధురాలు..ఓటర్లతో..
ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోడీ..రాఖీ కట్టిన వృద్ధురాలు..ఓటర్లతో..
చెన్నైకి బ్యాడ్‌న్యూస్.. ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..
చెన్నైకి బ్యాడ్‌న్యూస్.. ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే