ఆర్మీ జవాన్‌ సురక్షితంగా ఉన్నాడు : రక్షణ మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లి : జమ్ము కాశ్మీర్‌లోని బుద్గాంలో ఓ ఆర్మీ జవాన్‌ కిడ్నాప్‌నకు గురయ్యాడని మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదని రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. బుద్గాం జిల్లాలోని ఖాజిపొరాకు చెందిన జవాన్ కిడ్నాప్ కు గురయ్యాడంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో అధికారులు స్పందించారు. సెలవులో ఉన్న మహమ్మద్‌ యాసీన్‌ అనే జవాన్‌ కిడ్నాప్‌కు గురయ్యాడని వార్తలు వెలువడ్డాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే జవాన్‌ కిడ్నాప్‌నకు గురి కాలేదని, అతడు సురక్షితంగానే ఉన్నాడని […]

ఆర్మీ జవాన్‌ సురక్షితంగా ఉన్నాడు : రక్షణ మంత్రిత్వ శాఖ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 09, 2019 | 5:00 PM

న్యూఢిల్లి : జమ్ము కాశ్మీర్‌లోని బుద్గాంలో ఓ ఆర్మీ జవాన్‌ కిడ్నాప్‌నకు గురయ్యాడని మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదని రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. బుద్గాం జిల్లాలోని ఖాజిపొరాకు చెందిన జవాన్ కిడ్నాప్ కు గురయ్యాడంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో అధికారులు స్పందించారు. సెలవులో ఉన్న మహమ్మద్‌ యాసీన్‌ అనే జవాన్‌ కిడ్నాప్‌కు గురయ్యాడని వార్తలు వెలువడ్డాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే జవాన్‌ కిడ్నాప్‌నకు గురి కాలేదని, అతడు సురక్షితంగానే ఉన్నాడని అధికారులు తెలిపారు.