ఫ్లాష్ న్యూస్: మందకృష్ణ మాదిగ అరెస్ట్..!
ఎమ్మార్సీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని హబ్సిగూడలో ఆయనను అరెస్ట్ చేసి నాచారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా.. ఈ రోజు హైదరాబాద్‌లో ఇందిరా పార్కు వద్ద నిర్వహించనున్న మహాదీక్ష (సకల జనుల దీక్ష)లో పాల్గొనవలసిందిగా తమ సంస్థ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. అయితే.. ముందుజాగ్రత్తగా.. పోలీసులు మందకృష్ణను అరెస్ట్ చేశారు. ఇందిరాపార్కు పరిసర ప్రాంతాల్లో.. పోలీసులు.. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం […]
ఎమ్మార్సీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని హబ్సిగూడలో ఆయనను అరెస్ట్ చేసి నాచారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా.. ఈ రోజు హైదరాబాద్‌లో ఇందిరా పార్కు వద్ద నిర్వహించనున్న మహాదీక్ష (సకల జనుల దీక్ష)లో పాల్గొనవలసిందిగా తమ సంస్థ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. అయితే.. ముందుజాగ్రత్తగా.. పోలీసులు మందకృష్ణను అరెస్ట్ చేశారు. ఇందిరాపార్కు పరిసర ప్రాంతాల్లో.. పోలీసులు.. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ.. ఆంక్షలు విధించారు.