రాజధాని తరలింపుపై అడుగు ముందుకే.. ఈసారి ఏం చేశారంటే!

మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చినప్పట్నించి ఏపీలో రాజధాని రాజకీయం జోరందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మూడు రాజధానుల ప్రతిపాదనను, అమరావతి నుంచి సచివాలయాన్ని, హైకోర్టును తరలించడాన్ని వ్యతిరేకిస్తున్న వారు ఉద్యమాన్ని గత 52 రోజులుగా కొనసాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సారథ్యంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అమరావతి ఏరియా ప్రజలకు సంఘీభావంగా ఉద్యమం జరిగినప్పటికీ ప్రస్తుతం ఈ ఆందోళన అమరావతి ప్రాంతానికే పరిమితమైంది. ఈనేపథ్యంలో కొంత మంది జెఏసీగా ఏర్పాటై న్యూఢిల్లీకి వెళ్ళి, అక్కడ కేంద్ర ప్రభుత్వ […]

రాజధాని తరలింపుపై అడుగు ముందుకే.. ఈసారి ఏం చేశారంటే!
Follow us
Rajesh Sharma

|

Updated on: Feb 07, 2020 | 12:26 PM

మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చినప్పట్నించి ఏపీలో రాజధాని రాజకీయం జోరందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మూడు రాజధానుల ప్రతిపాదనను, అమరావతి నుంచి సచివాలయాన్ని, హైకోర్టును తరలించడాన్ని వ్యతిరేకిస్తున్న వారు ఉద్యమాన్ని గత 52 రోజులుగా కొనసాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సారథ్యంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అమరావతి ఏరియా ప్రజలకు సంఘీభావంగా ఉద్యమం జరిగినప్పటికీ ప్రస్తుతం ఈ ఆందోళన అమరావతి ప్రాంతానికే పరిమితమైంది. ఈనేపథ్యంలో కొంత మంది జెఏసీగా ఏర్పాటై న్యూఢిల్లీకి వెళ్ళి, అక్కడ కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తూ రాజధాని తరలింపును అడ్డుకునేందుకు యత్నాలు కొనసాగిస్తున్నారు.

అయితే, ప్రభుత్వం మాత్రం రాజధాని తరలింపుపై అడుగులు ముందుకే వేస్తోంది. అమరావతిని రాజధానిగా ప్రకటించి, దానికి సీఆర్ఢీఏ పేరిట ఓ ప్రాధికార సంస్థను గతంలో ఏర్పాటు చేసి, దాని పరిధిలోకి గుంటూరు జిల్లాలోని పలు గ్రామాలను కలిపిన సంగతి తెలిసిందే. తాజాగా సీఆర్డీఏను జగన్ ప్రభుత్వం రద్దు చేసిన దరిమిలా.. పలు గ్రామాలను సమీపంలోని మునిసిపాలిటీల పరిధిలోకి తీసుకు వచ్చే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజధాని గ్రామాలైన నౌవులూరు, బేతపూడి, యర్రబాలెం గ్రామాలను మంగళగిరి మునిసిపాలిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అయితే ప్రభుత్వ జివోపై గ్రామాల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాజధాని గ్రామాలైన పెనమాక, ఉండవల్లి గ్రామాలను తాడేపల్లి మునిసిపాలిటీలో విలీనం చేస్తూ మరో కూడా జీవో జారీ అయ్యింది.