చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో రెండోరోజు ఐటీ సోదాలు.. ఆక్రమ ఆస్తులు ఎంతో తెలుసా..?
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్.. శ్రీనివాసరావుఇంట్లో రెండో రోజు కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక ఐటీ బృందాలు.. ఈ రైడ్స్ చేస్తున్నారు. ఏకకాలంలోనే విజయవాడ, హైదరాబాద్‌లోని శ్రీనివాసరావు నివాసాలతో పాటుగా మరికొన్ని చోట్ల కూడా ఈ తనిఖీలు చేపడుతున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడ గాయత్రినగర్‌లోని కంచుకోట అపార్ట్ మెంట్ మూడో ఫ్లోర్ […]
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్.. శ్రీనివాసరావుఇంట్లో రెండో రోజు కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక ఐటీ బృందాలు.. ఈ రైడ్స్ చేస్తున్నారు. ఏకకాలంలోనే విజయవాడ, హైదరాబాద్‌లోని శ్రీనివాసరావు నివాసాలతో పాటుగా మరికొన్ని చోట్ల కూడా ఈ తనిఖీలు చేపడుతున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడ గాయత్రినగర్‌లోని కంచుకోట అపార్ట్ మెంట్ మూడో ఫ్లోర్ 303 ఫ్లాట్‌లో కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులకు రక్షణగా కేంద్ర బలగాలు బందోబస్తును ఏర్పాటు చేశాయి. ఇక హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ సమీపంలోని చంపాపేట్‌లో కూడా రైడ్స్ చేస్తున్నారు అధికారులు.
కాగా, విజయవాడలో జరుగుతున్న రైడ్స్‌లో భాగంగా కంచుకోట అపార్ట్ మెంట్‌లోకి బయట నుంచి ఓ ప్రింటర్‌ను లోపలికి తీసుకెళ్లారు ఐటీ అధికారులు. ఈ క్రమంలో శ్రీనివాసరావు బంధువులు ఎవ్వరినీ లోనికి అనుమతించడం లేదు. మరో మూడు రోజుల పాటు ఈ సోదాలు జరిగే అవకాశం ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ఇప్పటికే దాదాపు రూ.150 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను గుర్తించినట్లు సమాచారం. అంతేకాకుండా పలు కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు అటు కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో కూడా గురువారం ఐటీ అధికారులు రైడ్స్ చేశారు. ఏకకాలంలోనే.. కడప, హైదరాబాద్‌లోని ఇళ్లలో రైడ్స్ చేపట్టారు. అటు శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఆర్కేఇన్‌ఫ్రా కార్పొరేషన్ ప్రైవేటు లిమిటెడ్ కార్యాలయంలో కూడా సోదాలు కొనసాగాయి.