2047 నాటికి ప్రపంచంలోనే భారత్ నెం.1గా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందిః చంద్రబాబు
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కాంబినేషన్ భవిష్యత్తులోనూ కొనసాగుతుందన్నారు. సూపర్-6 హమీలు అమలుచేసే బాధ్యత ఎన్డీయేదే అన్నారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే తమ విధానమని స్పష్టం చేశారు.
శ ప్రజలంతా ప్రధాని మోదీ వెంటే ఉన్నారు.. ఇకపైన మోదీతోనే ఉంటారని ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం, పేద ప్రజల కోసం ప్రధాని మోదీ అనుక్షణం తపిస్తున్నారని చంద్రబాబు కొనియాడారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ప్రజలకు చేరువైన వ్యక్తి మోదీ అని.. ప్రపంచ మెచ్చే నాయకుడు మోదీ అని ఏపీ సీఎం కొనియాడారు. విశాఖపట్నంలోని ఏయూలో జరిగిన బహిరంగా సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. బీజేపీ, టీడీపీ, జనసేన కాంబినేషన్ అదిరిందని.. చరిత్రలో నిలిచిపోయేలా 93 శాతం స్ట్రైక్ రేట్ విజయాన్ని అందించారని చంద్రబాబు గుర్తు చేశారు. ఏపీలో ఈ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుందని.. మోదీనే ప్రధానిగా ఉంటారని అన్నారు. గతేడాది జరిగిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది.. వచ్చే నెలలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేదే విజయమని ఏపీ సీఎం చంద్రబాబు జోస్యం చెప్పారు.
ప్రధాని మోదీ నుండి తాను స్ఫూర్తి పొందుతుంటానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రధాని మోదీ సహకారం పూర్తిగా ఉంటుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ సారథ్యంలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు నదుల అనుసంధానం పూర్తి చేస్తామని చంద్రబాబు అన్నారు. రామాయపట్నంలో బీపీసీఎల్ తీసువవచ్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు.
గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆర్థిక పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని, కష్టాలు, సమస్యలు ఉన్నాయన్నారు. వాటిని అధిగమించి ముందుకు వెళ్తామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్న చంద్రబాబు.. గూగూల్ సహా పలు భారీ సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడమే ఇందుకు నిదర్శమన్నారు. కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. 7 నెలల్లోనే రూ.2లక్షల కోట్ల పనులకు మోడీ శ్రీకారం చుట్టారని తెలిపారు. రూ.లక్షా 85వేల కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్.. విశాఖ రైల్వేజోన్ పనులు, 7 జాతీయ రహదారులకు ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయని చంద్రబాబు వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..