బ్రేకింగ్: టీడీపీ నేతలపై ఏపీ సీఐడీ కేసులు

తెలుగుదేశం నేతల మెడకు అమరావతి ఏరియాలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఉచ్చు బిగుసుకుంటోంది. సుమారు 4 వేల ఎకరాల మేరకు టీడీపీ నేతలు, వారి సన్నిహితులు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఇద్దరు మాజీ మంత్రులతోపాటు మొత్తం ఏడుగురిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. భూముల ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరుపుతున్న సీఐడి అధికారులు ప్రాథమిక సాక్ష్యాలు నిర్ధారణ కావడంతో తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పి. నారాయణతోపాటు మరో […]

బ్రేకింగ్: టీడీపీ నేతలపై ఏపీ సీఐడీ కేసులు
Follow us
Rajesh Sharma

|

Updated on: Feb 07, 2020 | 12:46 PM

తెలుగుదేశం నేతల మెడకు అమరావతి ఏరియాలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఉచ్చు బిగుసుకుంటోంది. సుమారు 4 వేల ఎకరాల మేరకు టీడీపీ నేతలు, వారి సన్నిహితులు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఇద్దరు మాజీ మంత్రులతోపాటు మొత్తం ఏడుగురిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. భూముల ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరుపుతున్న సీఐడి అధికారులు ప్రాథమిక సాక్ష్యాలు నిర్ధారణ కావడంతో తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పి. నారాయణతోపాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసింది.

అమరావతి భూముల కొనుగోలుపై సిఐడి విచారణ ముమ్మరం చేసింది. ఒక్కరోజులోనే మరో ఏడు కేసులు నమోదు చేసిన సిఐడి. మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పి. నారాయణలపై తెల్ల రేషన్ కార్డులు కలిగి వున్న వారి ద్వారా భూములు కొనుగోలు చేశారన్న అభియోగాలను మోపింది సీఐడి. ఇద్దరు మాజీ మంత్రులతోపాటు అబ్దుల్ జమేదార్, పొలినేని కొండలరావు, మండవ నాగమణి, మండవ అనురాధ, బొల్లినేని నరసింహ రావు, భూక్యా నాగమణిలపై సీఐడీ కేసులు నమోదు చేసి, విచారణ ప్రారంభించింది.

ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో వీరిపై కేసులు నమోదు చేశారు. 791 తెల్లరేషన్ కార్డు దారులను వాడుకుని కోట్లాది రూపాయల భూములు కొనుగోలు చేశారన్న ఆధారాలు సేకరించిన సిఐడి దానికి అనుగుణంగా యాక్షన్‌లోకి దిగింది.