బ్రేకింగ్: నిర్బయ దోషుల ఉరి ఇప్పట్లో లేనట్లే!
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నిర్భయ కేసు దోషుల ఉరితీత ఇప్పట్లో జరిగే పరిస్థితి కనిపించడం లేదు. దోషులకు వున్న అన్ని న్యాయ అవకాశాలను నిర్ణీత గడువులోగా వినియోగించుకోవాలని కోర్టులు ఆదేశాలివ్వలేవని, అలా చేస్తే అది వారి పౌరహక్కులకు భంగం కలిగించినట్లే అవుతుందని ఇవాళ సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. నలుగురు నిందితుల్లో ఒకడైన పవన్ గుప్తా తనకున్న న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవడం లేదని, తద్వారా దోషులు జాతి సహనాన్ని పరీక్షిస్తున్నారని సొలిసిటర్ జనరల్ శుక్రవారం సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. […]
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నిర్భయ కేసు దోషుల ఉరితీత ఇప్పట్లో జరిగే పరిస్థితి కనిపించడం లేదు. దోషులకు వున్న అన్ని న్యాయ అవకాశాలను నిర్ణీత గడువులోగా వినియోగించుకోవాలని కోర్టులు ఆదేశాలివ్వలేవని, అలా చేస్తే అది వారి పౌరహక్కులకు భంగం కలిగించినట్లే అవుతుందని ఇవాళ సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. నలుగురు నిందితుల్లో ఒకడైన పవన్ గుప్తా తనకున్న న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవడం లేదని, తద్వారా దోషులు జాతి సహనాన్ని పరీక్షిస్తున్నారని సొలిసిటర్ జనరల్ శుక్రవారం సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. దోషులకున్న అన్ని న్యాయపరమైన అవకాశాలను వారం రోజుల్లో వినియోగించుకునేలా నోటీసులు జారీ చేయాలని సొలిసిటర్ జనరల్ కోర్టును కోరారు. ఆయన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
నిర్భయ దోషులను విడివిడిగా ఉరి తీయాలని కేంద్రం దాఖలు చేసిన పిటిషన్నిసుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మసనం శుక్రవారం విచారించింది. నిర్భయ దోషులు జాతి సహనాన్ని పరీక్షిస్తున్నారని కోర్టుకు తెలిపిన సోలిసిటర్ జనరల్.. దోషుల న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకునే వరకు ఉరిశిక్ష అమలు చేయలేమని అధికారులు చెప్తున్నారని సుప్రీం బెంచ్‌కు వివరించారు. దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా రివ్యూ పిటిషన్‌ని 2018లో సుప్రీంకోర్టు కొట్టేసినప్పటి నుంచి ఇప్పటివరకు తనకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకోలేదని సోలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు.
హైకోర్టు ఇచ్చిన వారం రోజుల గడువులోపు దోషులకు ఉన్న అవకాశాలను వినియోగించుకునేల నోటీసులు ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనాన్ని కోరారు. ఆయన అభ్యర్థన మేరకు నోటీసులు ఇవ్వడానికి ధర్మాసనం అంగీకరించలేదు. న్యాయ అవకాశాలను ఉపయోగించుకోవాలని ఏ ఒక్కరు ఒత్తిడి చేయలేరని బెంచ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జస్టిస్ భూషణ్ అన్నారు. తదుపరి విచారణను ఫిబ్రవరి11 మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది త్రిసభ్య ధర్మాసనం.
దోషులను ఒకేసారి ఉరితీయాలన్న నిర్ణయం నేపథ్యంలో పవన్ గుప్తాకు ఇంకా పలు అవకాశాలు మిగిలే వున్నాయి. రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరడం, క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేయడం వంటి అవకాశాలు దోషుల్లో ఒకరికి మిగిలే వున్న నేపథ్యంలో మిగిలిన ముగ్గురి ఉరిశిక్షను కూడా అమలు చేయలేని పరిస్థితి నెలకొంది. పవన్ గుప్తా గనక తనకున్న న్యాయపరమైన అవకాశాలను ఇప్పట్లో వినియోగించుకోకపోతే.. వారి ఉరి శిక్ష అమలు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు.
ఒక్క పవన్ గుప్తా కారణంగా మిగిలిన వారి ఉరి అమలు కూడా నిరవధికంగా వాయిదా పడే పరిస్థితి కనిపిస్తోందని న్యాయనిఫుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంతటి పెద్ద శిక్ష పడినా దాని అమలుకు ఇన్ని న్యాయపరమైన చిక్కులుంటే దోషులకు వెసులుబాటు దొరుకుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.