పార్టీ ప్రక్షాళనపై బాబు నజర్..మళ్ళీ ఉత్తరాంధ్రకే ఆ పోస్టు

ఓ పక్క అధికార వైసీపీపై యుద్ధం చేస్తున్న చంద్రబాబు పార్టీ ప్రక్షాళనపై కూడా దృష్టి సారించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. 2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీకి జనసత్వాలు నింపేందుకు ఆయన అంతర్గతంగా కసరత్తు చేస్తున్నట్లు పార్టీలో కీలక వర్గాలు చెప్పుకుంటున్నాయి. యువతకు పెద్ద పీట వేస్తూ.. అన్ని సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యమిచ్చేలా పార్టీలో సంస్థాగత మార్పులు చేసేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నారని అనుకుంటున్నాయి పార్టీ శ్రేణులు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు తనకు తానుగా జాతీయ అధ్యక్షునిగా మారి.. […]

పార్టీ ప్రక్షాళనపై బాబు నజర్..మళ్ళీ ఉత్తరాంధ్రకే ఆ పోస్టు

ఓ పక్క అధికార వైసీపీపై యుద్ధం చేస్తున్న చంద్రబాబు పార్టీ ప్రక్షాళనపై కూడా దృష్టి సారించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. 2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీకి జనసత్వాలు నింపేందుకు ఆయన అంతర్గతంగా కసరత్తు చేస్తున్నట్లు పార్టీలో కీలక వర్గాలు చెప్పుకుంటున్నాయి. యువతకు పెద్ద పీట వేస్తూ.. అన్ని సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యమిచ్చేలా పార్టీలో సంస్థాగత మార్పులు చేసేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నారని అనుకుంటున్నాయి పార్టీ శ్రేణులు.

రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు తనకు తానుగా జాతీయ అధ్యక్షునిగా మారి.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు రెండు వేర్వేరు రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఏపీ విభాగం అధ్యక్షునిగా కమిడి కళా వెంకట్రావును నియమించారు. గత అయిదేళ్ళుగా ఏపీ అధ్యక్షునిగా కళావెంకట్రావు వ్యవహరిస్తుండగా.. ఆయనలో దూకుడు లేదని తాజాగా చంద్రబాబు భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దానికి తోడు ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు.

మరోవైపు పార్టీలో వృద్ధతరం మారి యువతరం సంఖ్య పెరుగుతోంది. దానికి అనుగుణంగా యువతకు భవిష్యత్తులో పెద్ద పీట వేయాల్సిన అవసరం చంద్రబాబుకు కనిపిస్తోంది. మరోవైపు చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ భవిష్యత్తులో కీలక బాధ్యతలను నిర్వర్తించేందుకు అనుగుణంగా పార్టీలో ఆయన అనుయాయ వర్గాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా చంద్రబాబుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర అధ్యక్షుని పదవి నుంచి కళావెంకట్రావును తప్పించి.. ఆయన స్థానంలో శ్రీకాకుళం జిల్లాకే చెందిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని పార్టీ అధ్యక్షునిగా చేస్తారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

సిట్టింగ్ ఎమ్మెల్యేగా వున్న అచ్చెన్నాయుడు దూకుడు తత్వం పార్టీ యువతలో దూసుకుపోవడానికి ఉపయోగపడుతుందని చంద్రబాబు అంఛనా వేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి తోడు నారా లోకేశ్ సమవయస్కులైన మరికొంత మందిని రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకోవడం ద్వారా లోకేశ్ భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ దూకుడుని తట్టుకోవడం ద్వారా 2024 ఎన్నికల్లో విజయం సాధించే దిశగా చంద్రబాబు పార్టీ ప్రక్షాళనకు నడుం కట్టినట్లు చెప్పుకుంటున్నారు.

Published On - 5:19 pm, Fri, 7 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu