ఆమె నుదిటి బొట్టు టాక్ ఆఫ్ ద వరల్డ్, భారత సంతతి నాసా సైంటిస్ట్ స్వాతి మోహన్ చూపు.. శైలి అన్నీ సూపర్ అట్రాక్షన్

NASA Scientist Swati Mohan : డాక్టర్ స్వాతి మోహన్. భారత సంతతికి చెందిన నాసా శాస్త్రవేత్త. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించిన రోవర్ రెడ్ ప్లానెట్..

  • Venkata Narayana
  • Publish Date - 11:10 am, Sun, 21 February 21
ఆమె నుదిటి బొట్టు టాక్ ఆఫ్ ద వరల్డ్, భారత సంతతి నాసా సైంటిస్ట్ స్వాతి మోహన్ చూపు.. శైలి అన్నీ సూపర్ అట్రాక్షన్

NASA Scientist Swati Mohan : డాక్టర్ స్వాతి మోహన్. భారత సంతతికి చెందిన నాసా శాస్త్రవేత్త. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించిన రోవర్ రెడ్ ప్లానెట్‌ ఆపరేషన్ ఎంత సక్సెస్ అయిందో, అంతే రేంజ్‌లో డాక్టర్ స్వాతి మోహన్ పేరు పాపులర్ అవుతోంది. ఆమె తీక్షణ చూపులు, కట్టు బొట్టు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తూ ప్రపంచ వ్యాపితం అవుతున్నాయి. మార్స్ 2020 మిషన్ విజయవంతమవుతున్న సందర్భాన నాసా కేంద్రంలో ఆమె చూపులు, ముఖ్యంగా బొట్టు గురించి ప్రపంచమంతా చర్చించుకుంటోంది. పనిపట్ల ఆమె చూపిస్తున్న తీక్షణత, ఏకాగ్రత ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక ఇండియన్స్ ఆనందానికి అవధుల్లేవు. అంతేకాదు, ముఖ్యంగా ఆమె నుదట ధరించిన బొట్టు ఇప్పుడు టాక్ ఆఫ్ ద వరల్డ్ గా మారింది. మార్స్ మిషన్ సక్సెస్ అవుతోన్న సందర్భంలోని ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రెండింగ్ గా నిలుస్తున్నాయి.

డాక్టర్ స్వాతి మోహన్ వయసు ఏడాది ఉండగా ఆమె పేరెంట్స్ భారతదేశం నుండి అమెరికాకు వలస వచ్చారు. నార్తర్న్ వర్జీనియా, వాషింగ్టన్ డిసి మెట్రో ప్రాంతంలో పెరిగిన ఆమె కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ & ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. ఏరోనాటిక్స్ / ఆస్ట్రోనాటిక్స్లో లో ఎంఎస్ పూర్తి చేసి, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) నుండి పిహెచ్.డి. పట్టా పొందింది. నాసా ప్రతిష్టాత్మకంగా రూపొందించి, ప్రయోగించిన మార్స్ 2020 మిషన్ లో స్వాతి కీలక బాధ్యతలు నిర్వర్తించారు. మిషన్ కు మార్గదర్శకత్వం వహించడంతోపాటు, నావిగేషన్, నియంత్రణ కార్యకలాపాలకు నాయకత్వం వహించి విజయవంతమై అందరి మన్ననలు పొందుతున్నారు.

Read also : లాయర్ దంపతుల హత్య నేపథ్యం : గుంజపడుగు బయల్దేరిన బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులు, దగ్గరుండి పంపించిన రాజాసింగ్

AP Panchayat Elections 2021 live: ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు.. నాలుగో విడత పోలింగ్ ప్రారంభం..

భారతావనిలో ఉరితీయబోతోన్న మొదటి మహిళగా షబ్నమ్.!, ప్రెసిడెంట్ అంకుల్.. అంటూ క్షమాభిక్ష అభ్యర్థనకు ఫలితం దక్కేనా?