లాయర్ దంపతుల హత్య నేపథ్యం : గుంజపడుగు బయల్దేరిన బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులు, దగ్గరుండి పంపించిన రాజాసింగ్

పెద్దపల్లి జిల్లాలో లాయర్ దంపతుల హత్యకు నిరసనగా బీజేపీ ఛలో గుంజపడుగుకు పిలుపునిచ్చింది. 200 మంది బీజేపీ లీగల్‌ సెల్‌ ప్రతినధులు గుంజపడుగుకు..

లాయర్ దంపతుల హత్య నేపథ్యం :  గుంజపడుగు బయల్దేరిన బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులు, దగ్గరుండి పంపించిన రాజాసింగ్

పెద్దపల్లి జిల్లాలో లాయర్ దంపతుల హత్యకు నిరసనగా బీజేపీ ఛలో గుంజపడుగుకు పిలుపునిచ్చింది. 200 మంది బీజేపీ లీగల్‌ సెల్‌ ప్రతినధులు గుంజపడుగుకు బయల్దేరి వెళ్లారు. ఈ బృందం వామన్‌రావు కుటుంబ సభ్యులను పరామర్శించనుంది. హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన న్యాయవాదులను ఎమ్మెల్యే రాజాసింగ్‌ దగ్గరుండి పంపించారు.

కాగా, గుంజపడుగు గ్రామంలో కొనసాగుతున్న పెద్దమ్మ ఆలయ నిర్మాణమే లాయర్ దంపతులు వామన్ రావు, నాగమణి హత్యలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. గుడి నిర్మాణం కోసం ఏ2 కుంట శ్రీను పెద్ద ఎత్తు అక్రమాలకు పాల్పడుతున్నారని తరచూ న్యాయవాది గట్టు వామన్‌రావు ఆరోపణలు చేసేవారు. వాట్సాప్‌గ్రూపుల్లో దీనిపై చర్చకు కారణమయ్యేలా పోస్టులు పెట్టేవారు. చందాల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని… గుడిని ఓ ప్రైవేటు కంపెనీ నిర్మిస్తోందని ఆరోపణలు చేసేవారు.

తప్పుడు పత్రాలతో ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని మన మంథని నియోజకవర్గం గ్రూపులో పోస్టులు పెట్టారు. నేరుగా ఎక్కడా కుంట శ్రీను పేరు చెప్పకపోయినా ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. అక్రమ నిర్మాణాల వద్ద గ్రామస్తులు చేపట్టిన ఆందోళన ప్లెక్సీ ఫొటోలను కూడా గ్రూపులో పెట్టారు. వివిధ వార్త పత్రిల్లో వచ్చిన న్యూస్‌ను కూడా పోస్టు చేసి విమర్శల వాడిని పెంచారు. గట్టు వామనరావు పోలీసు వ్యవస్థను కూడా ప్రశ్నించారు. అనాధికారికంగా రామాలయానికి రంగులు వేస్తుంటే పట్టించుకోరా అంటూ నిలదీశారు. 100కు డయల్ చేసినా మంథనిలో స్పందించే పోలీసులే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి చాలా అంశాలు ఈ మర్డర్‌తో ముడిపడి ఉన్నాయని చెబుతున్నారు.

Read also : ప్రాణాపాయం ఉందని 6 నెలల నుంచీ ప్రాధేయపడుతున్నారు.. చీఫ్‌ జస్టిస్‌కే మొరపెట్టుకున్నారు. చివరికి ఊహించిందే అయింది