ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన

ట్రాఫిక్‌ రద్దీని అరికట్టేందుకు మహానగరంలో మరో ఎలివేటెడ్‌ కారిడార్‌ అందుబాటులోకి రానుంది. మలక్ పేట్ లో మరో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నల్లగొండ క్రాస్‌రోడ్‌ నుంచి ఓవైసీ జంక్షన్‌ వరకు ఎస్‌ఆర్‌డీపీ కింద మరో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు.

ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
Follow us
Balaraju Goud

| Edited By:

Updated on: Jul 23, 2020 | 4:07 PM

ట్రాఫిక్‌ రద్దీని అరికట్టేందుకు మహానగరంలో మరో ఎలివేటెడ్‌ కారిడార్‌ అందుబాటులోకి రానుంది. మలక్ పేట్ లో మరో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నల్లగొండ క్రాస్‌రోడ్‌ నుంచి ఓవైసీ జంక్షన్‌ వరకు ఎస్‌ఆర్‌డీపీ కింద మరో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌, పట్టణాభివృద్ది శాఖ మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహముద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

దాదాపు రూ. 523.37కోట్ల వ్యయంతో నల్గొండ క్రాస్‌రోడ్స్‌ నుంచి ఒవైసీ జంక్షన్‌ వరకు సుమారు మూడున్నర కిలోమీటర్ల పొడవున దీని నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కారిడార్‌ పొడవు 3.382 కిలోమీటర్లు కాగా, ఇందులో ఫ్లై ఓవర్‌ పొడవు 2.580 కిలోమీటర్లు. రద్దీగా ఉండే ఈ మార్గంలో జంక్షన్ల వద్ద ఆగకుండా వాహనాలు రెండు వైపులా రాకపోకలు కొనసాగించేలా నాలుగు లేన్లతో వంతెన నిర్మిస్తున్నారు. రెండేళ్లలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంగా నిర్మాణం ప్రారంభించారు. .