దారి తప్పిన దీదీ హెలికాఫ్టర్
వెస్ట్ బెంగాల్ : పశ్చిమ బెంగాల్ సీఎం ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ దారితప్పడం టీఎంసీ పార్టీ శ్రేణుల్లో, అధికారుల్లో కలవరానికి కారణమైంది. బుధవారం ఉత్తర దీనాజ్‌పూర్ జిల్లా చోప్రాలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కోసం మమతా బెనర్జీ.. మధ్యాహ్నం 1.05 గంటలకు సిలిగురి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరారు. అయితే షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1.27 గంటలకు ఆమె అక్కడికి చేరుకోవాల్సి ఉంది. అయితే సమయం దాటినా కూడా మమత బెనర్జీ ప్రయాణిస్తున్న చాపర్ అక్కడికి రావకపోవడంతో జిల్లా […]
వెస్ట్ బెంగాల్ : పశ్చిమ బెంగాల్ సీఎం ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ దారితప్పడం టీఎంసీ పార్టీ శ్రేణుల్లో, అధికారుల్లో కలవరానికి కారణమైంది. బుధవారం ఉత్తర దీనాజ్‌పూర్ జిల్లా చోప్రాలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కోసం మమతా బెనర్జీ.. మధ్యాహ్నం 1.05 గంటలకు సిలిగురి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరారు. అయితే షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1.27 గంటలకు ఆమె అక్కడికి చేరుకోవాల్సి ఉంది. అయితే సమయం దాటినా కూడా మమత బెనర్జీ ప్రయాణిస్తున్న చాపర్ అక్కడికి రావకపోవడంతో జిల్లా అధికారులు ఆందోళనకు గురయ్యారు. అయితే మమత ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ పైలట్ సభాస్థలిని గుర్తించకపోవడంతో.. వారు బీహార్‌లోకి ప్రవేశించారు.
వెంటనే పైలట్‌తో సంప్రదింపులు జరిపిన అధికారులు హెలికాఫ్టర్ సభాస్థలికి చేరుకునేలా సంకేతాలు ఇచ్చారు. దీంతో మమత ప్రయాణిస్తున్న చాపర్ మధ్యాహ్నం 2 గంటల సమయంలో హెలిప్యాడ్ వద్ద క్షేమంగా ల్యాండ్ అయింది. ఆ తర్వాత చోప్రా సభలో ప్రసంగించిన మమత.. సభకు సమయానికి రాలేకపోయినందుకు క్షమాపణలు కోరారు. పైలట్ హెలికాఫ్టర్ దిగే స్థలాన్ని గుర్తించకపోవడం వల్ల ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలిపారు.