నేడే తొలి విడత సమరం

నేడు దేశ వ్యాప్తంగా తొలి విడతలో 20 రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ, తెలంగాణ సహా మొత్తం 91 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇక ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 175 అసెంబ్లీ స్థానాల్లో 2,118 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందుకోసం 45,920 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే […]

నేడే తొలి విడత సమరం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 11, 2019 | 7:32 AM

నేడు దేశ వ్యాప్తంగా తొలి విడతలో 20 రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ, తెలంగాణ సహా మొత్తం 91 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

ఇక ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 175 అసెంబ్లీ స్థానాల్లో 2,118 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందుకోసం 45,920 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. 443 అభ్యర్థులు బరిలో ఉన్నారు. 34,604 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇరు రాష్ట్రాల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు.