బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలంటూ హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్ : బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కిషన్‌రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. హైదరాబాద్‌కు చెందిన ఓ న్యాయవాదితో పాటు మరో వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. రిట్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగనుంది. రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదు విత్ డ్రా చేయకూడదని ఆర్బీఐ నిబంధన ఉంది. కానీ.. ఆ నిబంధనలకు విరుద్ధంగా బీజేపీ నేతలు బ్యాంక్ నుంచి రూ.8 కోట్ల నగదు ఎలా విత్ డ్రా చేస్తారని […]

బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలంటూ హైకోర్టులో పిటిషన్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 10, 2019 | 8:23 PM

హైదరాబాద్ : బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కిషన్‌రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. హైదరాబాద్‌కు చెందిన ఓ న్యాయవాదితో పాటు మరో వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. రిట్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగనుంది. రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదు విత్ డ్రా చేయకూడదని ఆర్బీఐ నిబంధన ఉంది. కానీ.. ఆ నిబంధనలకు విరుద్ధంగా బీజేపీ నేతలు బ్యాంక్ నుంచి రూ.8 కోట్ల నగదు ఎలా విత్ డ్రా చేస్తారని పిటిషన్ వేశారు. ఈ విషయాన్ని ఈ నెల 9న ఈసీ దృష్టికి తీసుకెళ్లామని పిటిషనర్లు పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్ధి కిషన్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పిటిషనర్లు కోరారు.