ప్రధాని మోదీపై పోటీకి దిగనున్న హైకోర్టు మాజీ న్యాయమూర్తి
చెన్నై : ప్రధాని మోదీపై పోటీకి హైకోర్టు మాజీ జడ్జి సిద్దమయ్యారు. మద్రాసు, కలకత్తా హైకోర్టుల్లో న్యాయమూర్తిగా పని చేసి పదవీ విరమణ చేసిన సీఎస్ కర్ణన్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేయాలని కర్ణన్ నిర్ణయించుకున్నారు. మోదీపై పోటీ చేయాలనే ఉద్దేశ్యంతో తానిప్పుడు వారణాసిలో ఉన్నానని, నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి అవసరమైన ప్రాథమిక పనుల్లో నిమగ్నమై ఉన్నానని ఆయన తెలిపారు. అయితే […]
చెన్నై : ప్రధాని మోదీపై పోటీకి హైకోర్టు మాజీ జడ్జి సిద్దమయ్యారు. మద్రాసు, కలకత్తా హైకోర్టుల్లో న్యాయమూర్తిగా పని చేసి పదవీ విరమణ చేసిన సీఎస్ కర్ణన్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేయాలని కర్ణన్ నిర్ణయించుకున్నారు. మోదీపై పోటీ చేయాలనే ఉద్దేశ్యంతో తానిప్పుడు వారణాసిలో ఉన్నానని, నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి అవసరమైన ప్రాథమిక పనుల్లో నిమగ్నమై ఉన్నానని ఆయన తెలిపారు. అయితే కర్ణన్ ఇప్పటికే సెంట్రల్ చెన్నై లోక్‌సభ నియోజక వర్గంనుంచి నామినేషన్ దాఖలు చేశారు. తాను స్వయంగా స్థాపించిన యాంటి కరప్షన్ డైనమిక్ పార్టీ (ఎసిడిపి) తరఫున ఆయన నామినేషన్ దాఖలు చేశారు.