బ్రేకింగ్: అమరావతి గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు లేవు

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో.. రాజధాని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను మినహాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

బ్రేకింగ్: అమరావతి గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు లేవు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 08, 2020 | 5:16 PM

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో.. రాజధాని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను మినహాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాజధాని గ్రామాలను ప్రత్యేక కార్పొరేషన్‌కు ఏర్పాటు చేయాలనుకుంటోన్న ప్రభుత్వం.. ఇతర మున్సిపాలిటీల్లో విలీనం దిశగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా యర్రబాలెం, బేతపూడి, నవులూరు గ్రామాలను మంగళగిరి మున్సిపాలిటీలో.. పెనుమాక, ఉండవల్లి గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిటీలో కలపాలని ప్రతిపాదన చేస్తోంది. అలాగే నీరుకొండ, నిడమర్రు, కురగల్లు, కృష్ణాయపాలెంతో పాటు తుళ్లూరు మండలంలోని గ్రామాలను కలిపి అమరావతి కార్పొరేషన్‌గా చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.

ఏపీ ఎన్నికల కమిషన్‌కు ద్వివేది లేఖ: మరోవైపు ఎపీ ఎన్నికల కమిషన్‌కు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వశాఖ ముఖ్యకార్యదర్శి  గోపాలకృష్ణ ద్వివేది లేఖ రాశారు. ఎన్నికలు నిర్వహించని గ్రామాల పంచాయితీల వివరాలను జిల్లాల వారీగా లేఖలో ప్రస్తావించిన ద్వివేది.. ఆ గ్రామ పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించొద్దని ఎన్నికల కమిషన్‌ను కోరారు. అమరావతి రాజధాని పరిధిలో గ్రామాల్లోనూ పంచాయితీ ఎన్నికలు నిలిపివేయాలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.