AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: భారీ బడ్జెట్.. రెవెన్యూ మిగులు.. ఆర్థిక లోటు

భారీ సైజు బడ్జెట్‌తో ముందుకొచ్చారు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు. కేసీఆర్ ప్రభుత్వ ప్రాధాన్యతలైన సాగునీరు, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు పెద్ద పీట వేస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు.

Breaking News: భారీ బడ్జెట్.. రెవెన్యూ మిగులు.. ఆర్థిక లోటు
Rajesh Sharma
|

Updated on: Mar 08, 2020 | 12:49 PM

Share

Harish Rao proposed a huge budget before assembly: తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు.. తన తొలి బడ్జెట్‌నే భారీగా మలిచారు. దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల మేరకు భారీ బడ్జెట్‌తో ముందుకొచ్చారు. లక్షా 82 వేల కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రతిపాదించారు. రెవెన్యూ మిగులును ప్రతిపాదిస్తూ.. ఆర్థిక లోటును ప్రస్తావించారు.

తొలిసారి ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్‌ను ప్రతిపాదించిన హరీశ్ రావు.. కేసీఆర్ ప్రభుత్వ ప్రాధాన్యాలను పెద్ద పీట వేసినట్లు చెప్పుకున్నారు. రైతు బంధు పథకానికి పన్నెండు వేల కోట్ల రూపాయలను కేటాయించిన ఆర్థిక మంత్రి.. రైతు రుణ మాఫీని ఒకే విడతలో చేయబోతున్నట్లు ప్రకటించారు.

రెవెన్యూ మిగులు 4,482 కోట్లుండే ఛాన్స్ వుందన్న మంత్రి.. ఆర్థిక లోటును మాత్రం 33 వేల 181 కోట్లుగా పేర్కొన్నారు. సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ.. 11 వేల 758 కోట్ల రూపాయలు పెన్షన్లకు కేటాయిస్తున్నానని చెప్పారు. అదే సమయంలో కేసీఆర్ మార్గదర్శకత్వంలో సాగునీటికి పెద్ద పీట వేస్తూ.. 11 వేల 54 కోట్ల రూపాయలు సాగునీటి రంగానికి కేటాయిస్తున్నట్లు తెలిపారు హరీశ్ రావు.లక్షా 82 వేల కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌లో లక్షా 38 వేల 668 కోట్ల రూపాయలు రెవెన్యూ వ్యయంగా పేర్కొన్నారు.

తెలంగాణ బడ్జెట్ 2020-21

బడ్జెట్ మొత్తం – రూ.1,82,914.42 కోట్లు

రెవెన్యూ వ్యయం – రూ.1,38,669.82 కోట్లు

క్యాపిటల్ వ్యయం – రూ.22,061.18 కోట్లు

రెవెన్యూ మిగులు – రూ.4,482.12 కోట్లు

ఆర్థిక లోటు – రూ.33,191.25 కోట్లు

వివిధ రంగాలకు కేటాయింపులు:

# రైతుబంధు కు రూ.14 వేల కోట్లు

# రైతు భీమా కోసం రూ.1,141 కోట్లు

# రుణ మాఫీ కోసం రూ.6,225 కోట్లు

# మైక్రో ఇరిగేషన్ కోసం రూ. 600 కోట్లు

# రైతు మద్దతు ధర కోసం రూ.1000 కోట్లు

# రైతు వేదికల నిర్మాణం కోసం రూ.350 కోట్లు

# సాగునీటి పారుదల రంగానికి రూ.11,054 కోట్లు

# ఎంబీసీ కోసం రూ.500 కోట్లు

# అన్ని రకాల పెన్షన్ల కోసం రూ.11,758 కోట్లు

# మత్స్యకారుల కోసం రూ.1,586 కోట్లు

# కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కోసం రూ.350 కోట్లు

# ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ రూ.16,534 కోట్లు

# ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ కోసం రూ.9,577 కోట్లు

# మైనారిటీ అభివృద్ధి కోసం రూ.1,518 కోట్లు

# మొత్తం షెడ్యూల్ కులాల కోసం కేటాయింపు రూ.4,356 కోట్లు.

# మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,200 కోట్లు

# పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి కోసం రూ.23,005 కోట్లు

# మున్సిపల్ శాఖ కు రూ.14,809 కోట్లు

# ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రూ.2,650 కోట్లు

# పాఠశాల విద్య కోసం రూ.10,421 కోట్లు

# ఉన్నత విద్య కోసం రూ.1, 723 కోట్లు

# వైద్యరంగానికి రూ.6,186 కోట్లు

# విద్యుత్ రంగానికి పదివేల రూ.416 కోట్లు

# పారిశ్రామిక అభివృద్ధికి రూ.1,998 కోట్లు

# ఆర్టీసీ కోసం రూ.1000కోట్లు

# గృహ నిర్మాణం కోసం రూ.11,917 కోట్లు

# హరితహారం కోసం రూ.791 కోట్లు

# ఆర్ అండ్ బి కోసం రూ.3,494 కోట్లు

# పోలీస్ శాఖ కోసం రూ.5,852 కోట్లు

# ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల ప్రత్యేక నిధి రూ.480 కోట్లు

Read this: రుణమాఫీపై హరీశ్ రావు గుడ్ న్యూస్ Harish Rao good news on loan weaving