బాలకృష్ణకు అవమానం.. పట్టించుకోని ప్రభుత్వం

హిందూపురంఎమ్మెల్యే బాలకృష్ణకు అవమానం ఎదురైంది. లేపాక్షి ఉత్సవాల సందర్భంగా.. స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణకు ప్రాధాన్యత కల్పించలేదని..

బాలకృష్ణకు అవమానం.. పట్టించుకోని ప్రభుత్వం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 07, 2020 | 8:48 PM

హిందూపురంఎమ్మెల్యే బాలకృష్ణకు అవమానం ఎదురైంది. లేపాక్షి ఉత్సవాల సందర్భంగా.. స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణకు ప్రాధాన్యత కల్పించలేదని.. టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సాధారణంగా.. ఎక్కడైనా ప్రభుత్వం కార్యక్రమాలు, ఉత్సవాలు చేపడితే.. పార్టీలను పక్కనబెట్టి ప్రొటోకాల్‌ని పాటిస్తారు. అయితే ఇందుకు విరుద్ధంగా.. లేపాక్షి ఉత్సవాల్లో.. అధికార పార్టీ ఫొటేలే తప్ప.. బాలయ్య ఉన్న ఫొటోలు ఒక్కటీ కనిపించడం లేదు. కేవలం ఆహ్వాన పత్రికలో పేరు తప్ప.. మరెక్కడా బాలకృష్ణ ఫొటో కానీ.. పేరు కానీ లేకపోవడం ఆయన అభిమానుల్లో నిరాశను గురిచేసింది.

అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉత్సవాలను నిర్వహించిన సమయంలోనే టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇచ్చారనీ.. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మాత్రం ప్రొటోకాల్ పాటించడం లేదని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. కాగా.. గత కొన్ని సంవత్సరాలుగా.. హిందూపురం ఎమ్మెల్యేగా.. బాలకృష్ణ ఎంతో ఆర్భాటంగా ఈ ఉత్సవాలను నిర్వహించేవారు. అలాగే.. బెస్ట్ టూరిస్ట్ స్పాట్‌గా తీర్చి దిద్దడానికి ప్రయత్నించారు కూడా. అయినా.. బాలకృష్ణను.. వైసీపీ ప్రభుత్వం ఇలా అగౌరవపరచడం ఆయన ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు.

Read More: దొరబాబు ఫోన్‌ కాల్‌కి దిమ్మతిరిగే రియాక్షన్ ఇచ్చిన రోజా!