Breaking News: మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌కు కేంద్రం షాక్
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఏబీవీని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర హోం శాఖ సమర్థించింది.
Union Government shocks former IB chief AB Venkateshwarrao: ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఏబీవీని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర హోం శాఖ సమర్థించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ అధికారులు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శనివారం లేఖ రాశారు. ఈ లేఖలో ఏబీపై వచ్చిన ఆరోపణలను పరోక్షంగా ధృవీకరించారు.
తన కుమారుని సంస్థకు ప్రయోజనం కలిగించేలా కొన్ని కొనుగోలు ఒప్పందాలను చేసుకున్నారంటూ ఏబీ వెంకటేశ్వరరావును రెండు నెలల క్రితం ఏపీలోని జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేసిన ఏబీ.. ఒకవైపు కేంద్ర ట్రైబ్యునల్‌ను ఆశ్రయిస్తూ.. మరోవైపు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాదనను హోంశాఖకు నివేదించింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సబబైనదేనని కితాబునిచ్చింది.
సస్పెన్షన్‌నను సమర్థించడమే కాకుండా.. ఏబీవీపై వచ్చిన ఆరోపణలపై లోతైన దర్యాప్తు జరపాలని ఏపీ డీజీపీని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. ఏబీవీపై వచ్చిన ఆరోపణలపై వెంటనే ఛార్జీ షీట్ ఓపెన్ చేయాలని నిర్దేశించింది. ఏరియల్ వాహన కొనుగోలులో అవకతవకలు జరగాయనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని కేంద్రం అభిప్రాయపడిందది. ఏరోసాట్, యూఏవీల కొనుగోలు కోసం వెచ్చించిన 25.5 కోట్ల రూపాయల వ్యవహారంలో భారీ అక్రమాలు జరిగినట్లు ప్రాధామిక ఆధారాలున్నాయని పేర్కొన్నారు. ఏఫ్రిల్ 7 లోగా ఛార్జిషీట్ దాఖలు చేయాలని ఏపీ చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖలో కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.