AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ సీఎంకు తెలంగాణ కేకే షాక్

ఏపీలో శాసనమండలిని రద్దు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సన్నిహితంగా వుంటున్న జగన్‌పై కేకే కామెంట్స్ చేయడం సెన్సేషన్‌గా మారింది. ఏపీలో ఎంబర్రాసింగ్‌గా మారిన లెజిస్లేటివ్ కౌన్సిల్‌ను రద్దు చేస్తూ సోమవారం అసెంబ్లీలో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఏపీలో కౌన్సిల్ రద్దు హట్ టాపిక్‌గా మారింది. అయితే, […]

ఏపీ సీఎంకు తెలంగాణ కేకే షాక్
Rajesh Sharma
|

Updated on: Jan 28, 2020 | 2:44 PM

Share

ఏపీలో శాసనమండలిని రద్దు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సన్నిహితంగా వుంటున్న జగన్‌పై కేకే కామెంట్స్ చేయడం సెన్సేషన్‌గా మారింది.

ఏపీలో ఎంబర్రాసింగ్‌గా మారిన లెజిస్లేటివ్ కౌన్సిల్‌ను రద్దు చేస్తూ సోమవారం అసెంబ్లీలో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఏపీలో కౌన్సిల్ రద్దు హట్ టాపిక్‌గా మారింది. అయితే, రాజ్యసభ సభ్యునిగా వున్న కేకే.. ఇటీవలి మునిసిపల్ ఎన్నిక ప్రక్రియలో చైర్మెన్ ఎంపికలో తన ఓటు హక్కు వినియోగించుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఈ విషయంలో కేకే మంగళవారం నాడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిశారు. తాను తప్పుగా ఓటు వేసినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో క్లారిటీ ఇచ్చేందుకే తాను ఈసీని కలిసినట్లు కేకే చెప్పారు. అయితే ఈ సందర్భంగా విలేకరుల అడిగిన ప్రశ్నకు ఆయన రెస్పాండయ్యారు.

ఏపీలో శాసనమండలి నిర్వహణకు అడ్డగోలుగా 60 కోట్ల రూపాయలు వృధాగా ఖర్చవుతుందన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలను కేకే తీవ్రంగా తప్పుపట్టారు. మండలి అనేది పెద్దలు, మేధావుల సభ అని వారి అభిప్రాయాలు శాసనాల రూపకల్పనలో ఎంతో ఉపయుక్తమవుతాయని కేకే అన్నారు. అలాంటి పెద్దల సభ నిర్వహణకు నిధులు వృధా అనడం తప్పని కేకే వ్యాఖ్యానించారు. గతంలో ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చేస్తే.. తాను పోరాటం చేశానని గుర్తు చేశారు కేకే.