ప్రకాశ్‌రాజ్‌కు కేసీఆర్ అభయహస్తం

జనవరి 29వ తేదీలోగా చంపేస్తామంటూ హెచ్చరికనందుకున్న సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభయహస్తం అందించారు. ప్రకాశ్‌రాజ్‌కు ప్రాణభయం అంటూ పత్రికలు, వెబ్‌సైట్లు పెద్ద ఎత్తున వార్తలను ప్రచురించడంతో కేసీఆర్ స్వయంగా స్పందించినట్లు సమాచారం. ప్రకాశ్‌రాజ్, బృందాకారత్, కుమారస్వామి తదితరులు 15 మందిని జనవరి 29న చంపేస్తామంటూ కొందరు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కేసీఆర్ స్పందించడం విశేషం. ప్రస్తుతం ప్రకాశ్‌రాజ్ బెంగళూరులో వున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకాశ్‌రాజ్‌కు మంగళవారం ఉదయం కాల్ చేసినట్లు […]

ప్రకాశ్‌రాజ్‌కు కేసీఆర్ అభయహస్తం
Rajesh Sharma

|

Jan 28, 2020 | 4:19 PM

జనవరి 29వ తేదీలోగా చంపేస్తామంటూ హెచ్చరికనందుకున్న సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభయహస్తం అందించారు. ప్రకాశ్‌రాజ్‌కు ప్రాణభయం అంటూ పత్రికలు, వెబ్‌సైట్లు పెద్ద ఎత్తున వార్తలను ప్రచురించడంతో కేసీఆర్ స్వయంగా స్పందించినట్లు సమాచారం. ప్రకాశ్‌రాజ్, బృందాకారత్, కుమారస్వామి తదితరులు 15 మందిని జనవరి 29న చంపేస్తామంటూ కొందరు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కేసీఆర్ స్పందించడం విశేషం.

ప్రస్తుతం ప్రకాశ్‌రాజ్ బెంగళూరులో వున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకాశ్‌రాజ్‌కు మంగళవారం ఉదయం కాల్ చేసినట్లు తెలుస్తోంది. ‘‘బ్రదర్ వార్తలను చూసి మీరేమీ భయపడవద్దు. మీకు అండగా నేనున్నాను. ఎవరు ఏం చేస్తారో చూద్దాం.. మీరు మా నివాసంలో వుందురు గానీ హైదరాబాద్ రండి ’’ అని కేసీఆర్.. ప్రకాశ్‌రాజ్‌కు అభయహస్తం అందించారని విశ్వసనీయ సమాచారం. కేసీఆర్ మాటలతో ఉప్పొంగిపోయిన ప్రకాశ్‌రాజ్.. ‘‘జనవరి 29న హైదరాబాద్‌లోనే వుంటానని, తప్పకుండా కలుస్తానని’’ కేసీఆర్‌కు సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది.

సినీనటుడైన ప్రకాశ్‌రాజ్ గత కొంత కాలంగా సామాజిక, రాజకీయ అంశాలపై తరచూ స్పందిస్తున్నారు. ముఖ్యంగా జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యానంతరం ఛాందసవాదులపై విరుచుకుపడుతున్నారు. గత మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన బెంగళూరు దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. అయినప్పటికీ.. తనదైన శైలిలో మోదీ ప్రభుత్వ విధానాలను తరచూ తప్పుపడుతున్నారు. ట్వీట్లు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రకాశ్‌రాజ్‌కు మరణశాసనం తప్పదని కొందరు హెచ్చరికలు జారీ చేశారు. అయితే వీటిపై ప్రకాశ్‌రాజ్ పెద్దగా స్పందించనప్పటికీ.. కేసీఆర్ స్వయంగా ఆయనకు ఫోన్ చేసి అభయహస్తం అందించడం విశేషం.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu