రంగంలోకి జనసేనాని.. రేపు అమరావతిలో హల్‌చల్

పది రోజుల పాటు రెస్ట్ తీసుకున్న జనసేనాధిపతి పవన్ కల్యాణ్ రాజధానిపై జరుగుతున్న రగడలోకి ఎంటరయ్యారు. సోమవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన పవన్ కల్యాణ్.. మంగళవారం అమరావతి ప్రాంతంలోని గ్రామాలలో పర్యటించనున్నారు. రాజధానికి సంబంధించిన అంశాలతో కూడిన ఓ బుక్‌లెట్‌ని పార్టీ మీటింగ్‌కు హాజరైన వారందరికి పంచిపెట్టిన జనసేనాధిపతి.. క్యాపిటల్ రగడలో తనదైన ముద్ర చూపేందుకు బరిలోకి దిగాలని నిర్ణయించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ రాజధాని అమరావతి పర్యటన వివరాలను జనసేన పార్టీ వెల్లడించింది. […]

రంగంలోకి జనసేనాని.. రేపు అమరావతిలో హల్‌చల్

పది రోజుల పాటు రెస్ట్ తీసుకున్న జనసేనాధిపతి పవన్ కల్యాణ్ రాజధానిపై జరుగుతున్న రగడలోకి ఎంటరయ్యారు. సోమవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన పవన్ కల్యాణ్.. మంగళవారం అమరావతి ప్రాంతంలోని గ్రామాలలో పర్యటించనున్నారు. రాజధానికి సంబంధించిన అంశాలతో కూడిన ఓ బుక్‌లెట్‌ని పార్టీ మీటింగ్‌కు హాజరైన వారందరికి పంచిపెట్టిన జనసేనాధిపతి.. క్యాపిటల్ రగడలో తనదైన ముద్ర చూపేందుకు బరిలోకి దిగాలని నిర్ణయించారు.

జనసేనాని పవన్ కళ్యాణ్ రాజధాని అమరావతి పర్యటన వివరాలను జనసేన పార్టీ వెల్లడించింది. మంగళవారం ఉదయం 8 గంటలకు మంగళగిరి పార్టీ ఆఫీసు నుంచి పవన్ కల్యాణ్ పర్యటన ప్రారంభమవుతుంది. అక్కడ్నించి ఎర్రపాలెం, మందడం, వెలగపూడి, తుళ్ళూరు ప్రాంతాల మీదుగా పవన్ కల్యాణ్ యాత్ర కొనసాగుతుంది. దారిలో రైతులు, రైతు కూలీలతో ముఖాముఖీ కలవాలని జనసేనాధిపతి భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

పవన్ కల్యాణ్ తమ ప్రాంతంలో పర్యటించనున్న సంగతి తెలుసుకున్న అమరావతి పరిరక్షణ సమితి నేతలు మంగళగిరి జనసేన కార్యాలయానికి వచ్చి, ఆయనతో భేటీ అయ్యారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయనికి చేరుకున్న అమరావతి పరిరక్షణ సమితి నేతలు. 13 రోజులుగా తాము ఉద్యమిస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని వారు పవన్ కల్యాణ్‌కు వివరించారు.

Click on your DTH Provider to Add TV9 Telugu