తిరుపతి కుర్రాడి ప్రాణం బలిగొన్న పబ్జీగేమ్

యువకులు, చిన్నారుల పేరిట మహమ్మారిలా మారిన ‘పబ్జీ గేమ్’ మరో యువకుడి ప్రాణం పోవడానికి కారణమైంది. తిరుపతిలో ఇంటర్మీడియట్ విద్యార్థి తోజోష్ పబ్జీగేమ్ కారణంగా ప్రాణాలొదిలాడు. పబ్జీ గేమ్ తో తీవ్రమైన ఒత్తిడి గురై ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతి బిటిఆర్ కాలనీలో ఈ ఘటన జరిగింది. రెండు రోజుల క్రితం గన్ కొనడానికి మూడు లక్షల రూపాయిలు కావాలంటూ తోజోష్ తన తండ్రిని అడిగినట్టు తెలుస్తోంది. పజ్జీ కోసం కాకుండా.. ఎదైనా వ్యాపారం కోసం […]

  • Venkata Narayana
  • Publish Date - 2:09 pm, Sat, 10 October 20
తిరుపతి కుర్రాడి ప్రాణం బలిగొన్న పబ్జీగేమ్

యువకులు, చిన్నారుల పేరిట మహమ్మారిలా మారిన ‘పబ్జీ గేమ్’ మరో యువకుడి ప్రాణం పోవడానికి కారణమైంది. తిరుపతిలో ఇంటర్మీడియట్ విద్యార్థి తోజోష్ పబ్జీగేమ్ కారణంగా ప్రాణాలొదిలాడు. పబ్జీ గేమ్ తో తీవ్రమైన ఒత్తిడి గురై ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతి బిటిఆర్ కాలనీలో ఈ ఘటన జరిగింది. రెండు రోజుల క్రితం గన్ కొనడానికి మూడు లక్షల రూపాయిలు కావాలంటూ తోజోష్ తన తండ్రిని అడిగినట్టు తెలుస్తోంది. పజ్జీ కోసం కాకుండా.. ఎదైనా వ్యాపారం కోసం ఎంతైనా ఇస్తామని తండ్రి చెప్పాడు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. ఎదురు డబ్బులిచ్చి తన కొడుకును గేమ్ ఆడటానికి రోజూ కొందరు పిలుస్తుంటారని యువకుడి తండ్రి చెప్పారు. సూసైడ్ వార్త విన్న అతని స్నేహితులు భారీ ఎత్తున తోజేష్ ఇంటికి చేరుకుంటున్నారు.