యడ్లపాడులో ఘోరం.. లవర్ కోసం ఫ్రెండ్‌ని చంపిన ప్రేమ్

గుంటూరుజిల్లా యడ్లపాడులో దారుణం జరిగిపోయింది. ప్రియురాలి కోసం స్నేహితుడికి గడ్డి మందు తాగించి చంపేశాడు ప్రేమ్ చంద్ అనే యువకుడు. ఒక మహిళ విషయంలో స్నేహితులైన గోపివర్మ – ప్రేమ్ చంద్‌ల మధ్య తలెత్తిన వివాదానికి ఈ విధమైన పరిష్కారాన్ని ఎంచుకున్నాడు ప్రేమ్ చంద్. ఇద్దరం కలిసి చనిపోదామంటూ యడ్లపాడుకు చెందిన గోపివర్మను నమ్మించాడు మర్రిపాలెంకు చెందిన ప్రేమ్ చంద్. ఈ క్రమంలో పక్కా ప్లాన్ ప్రకారం యాక్ట్ చేసిన ప్రేమ్ చంద్.. కూల్ డ్రింక్ లో […]

యడ్లపాడులో ఘోరం.. లవర్ కోసం ఫ్రెండ్‌ని చంపిన ప్రేమ్
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 10, 2020 | 2:01 PM

గుంటూరుజిల్లా యడ్లపాడులో దారుణం జరిగిపోయింది. ప్రియురాలి కోసం స్నేహితుడికి గడ్డి మందు తాగించి చంపేశాడు ప్రేమ్ చంద్ అనే యువకుడు. ఒక మహిళ విషయంలో స్నేహితులైన గోపివర్మ – ప్రేమ్ చంద్‌ల మధ్య తలెత్తిన వివాదానికి ఈ విధమైన పరిష్కారాన్ని ఎంచుకున్నాడు ప్రేమ్ చంద్. ఇద్దరం కలిసి చనిపోదామంటూ యడ్లపాడుకు చెందిన గోపివర్మను నమ్మించాడు మర్రిపాలెంకు చెందిన ప్రేమ్ చంద్. ఈ క్రమంలో పక్కా ప్లాన్ ప్రకారం యాక్ట్ చేసిన ప్రేమ్ చంద్.. కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలిపి గోపివర్మకు తాగించాడు. దీంతో తీవ్ర అస్వస్థతకు లోనైన గోపివర్మ గుంటూరు ప్రైవేటు హాస్పటల్ లో చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు కోల్పోయాడు. రెండవ తేదిన జరిగిన ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.