AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోరమైన తప్పిదం చేసి.. సారీ చెప్పిన ఫ్లిప్‌కార్డు

ఫ్లిప్‌కార్డ్‌ సంస్థకు చెందిన ఓ ఉద్యోగి చేసిన అతి పెద్ద తప్పిదం నెటిజన్లతో పాటు భారతీయ సిటిజన్ల ఆగ్రహానికి కారణమయ్యింది.. ఫెస్టివల్‌ సీజన్‌లో బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ పేరుతో గ్రాండ్‌ సేల్‌ జరుపుతోంది ఫ్లిప్‌కార్డ్‌

ఘోరమైన తప్పిదం చేసి.. సారీ చెప్పిన ఫ్లిప్‌కార్డు
Balu
|

Updated on: Oct 10, 2020 | 2:07 PM

Share

ఫ్లిప్‌కార్డ్‌ సంస్థకు చెందిన ఓ ఉద్యోగి చేసిన అతి పెద్ద తప్పిదం నెటిజన్లతో పాటు భారతీయ సిటిజన్ల ఆగ్రహానికి కారణమయ్యింది.. ఫెస్టివల్‌ సీజన్‌లో బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ పేరుతో గ్రాండ్‌ సేల్‌ జరుపుతోంది ఫ్లిప్‌కార్డ్‌ ఈ కామర్స్‌ సంస్థ… ఈ కంపెనీ సర్వీసులు ఎందుకో తెలియదు కానీ నాగాలాండ్‌లో అందుబాటులో లేవు.. ఇది ఆ రాష్ట్ర రాజధాని కొహిమాలో ఉన్న ఒక యూజర్‌కు కోపం తెప్పించింది.. ‘అయ్యా మాకింకా స్వాతంత్ర్యం లభించలేదు.. మేము ఇంకా భారత అంతర్బాగంలోనే ఉన్నాం.. ఎందుకు మాకు డెలివరీ చేయరు? దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను సమభావంతో చూడాలి కదా?’ అంటూ ప్రశించాడు.. ఇందుకు ఫ్లిప్‌కార్డు ఉద్యోగి ఇచ్చిన జవాబే పెను దుమారానికి దారి తీసింది.. అతగాడు ఇచ్చిన జవాబేమిటంటే ‘ఫ్లిప్‌కార్డుపై ఇంట్రెస్ట్‌ చూపించినందుకు థాంక్స్‌.. అయితే భారత్‌ వెలుపల మా సర్వీసులు ఉండవు.. ఇందుకు సారీ’ అని! ఇలాంటి జవాబు వస్తుందని ఊహించిన వినియోగదారులు తమ అనుభవాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసుకున్నారు.. గంటల్లోనే ఈ సందేశం అందరికీ చేరింది.. ఫ్లిప్‌కార్డుతో ఓ ఆటాడుకోవడం మొదలు పెట్టారు.. ‘ఏమయ్యా.. నాగాలాండ్‌కు ఫ్లిప్‌కార్డు స్వాంతంత్ర్యం ఇచ్చేసినట్టుగా ఉంది’ అని ఒకరు కామెంట్‌ చేస్తే.. నాగాలాండ్‌ భవిష్యత్తును ముందుగానే ఊహించనట్టు ఉన్నారని ప్రఖ్యాత నాగా సంగీతకారుడు అలోబో వ్యంగ్యంగా అన్నారు. ఈశాన్య రాష్ట్రాల గురించి ఈ దేశవాసులకు ఎంత తెలుసో ఈ సంఘటన చూపుతున్నదని ఆవేదన చెందారాయన! ఇందుకు దవేశంలోని విద్యావ్యవస్థే పూర్తి బాధ్యత వహించాలన్నారు.. ఫ్లిప్‌కార్డుతో కాకున్నా.. తనకూ ఇలాంటి అనుభవమే ఎదురయ్యిందని నాగాలాండ్‌ బోర్డర్స్‌ వ్యవహారాల డైరెక్టర్‌ జనరల్‌ రూపిన్‌ శర్మ అన్నారు. నాగాలాండ్‌ భారత అంతర్భాగమని తెలిపారు.. ఇదంతా చూసిన తర్వాతా ఫ్లిప్‌కార్డ్‌ సంస్థ తను చేసిన తప్పిదమేమిటో గ్రహించింది.. వెంటనే క్షమాపణలు చెప్పుకుంది.. టెక్నికల్‌ మిస్టేక్‌ అని వివరణ ఇచ్చుకుంది.. నాగాలాండ్‌లోనూ ఫ్లిప్‌కార్డు సేవలు అందిస్తుందని చెప్పుకొచ్చింది.. ఫ్లిప్‌కార్డు సారీ చెప్పినా నెటిజన్ల కోపం మాత్రం చల్లారలేదు..

సెంచరీతో చెలరేగిన గంటల్లోనే ఆసుపత్రి బెడ్ పై జైస్వాల్
సెంచరీతో చెలరేగిన గంటల్లోనే ఆసుపత్రి బెడ్ పై జైస్వాల్
రెంట్ అడగడానికి వెళ్లిన ఓనర్.. రాత్రి వరకు తిరిగి రాలేదు..
రెంట్ అడగడానికి వెళ్లిన ఓనర్.. రాత్రి వరకు తిరిగి రాలేదు..
బరువు తగ్గొచ్చని.. వీటిని ఎడాపెడా తినే అలవాటు మీకూ ఉందా?
బరువు తగ్గొచ్చని.. వీటిని ఎడాపెడా తినే అలవాటు మీకూ ఉందా?
మొలకలు.. చికెన్.. వేటిల్లో అధిక ప్రొటీన్‌ ఉంటుందో తెలుసా?
మొలకలు.. చికెన్.. వేటిల్లో అధిక ప్రొటీన్‌ ఉంటుందో తెలుసా?
మీ కురులు రాలిపోవడానికి ఈ ఆహారాలూ కారణమే.. తినకపోవడమే మంచిది!
మీ కురులు రాలిపోవడానికి ఈ ఆహారాలూ కారణమే.. తినకపోవడమే మంచిది!
2026లో ఊహించని సంచలనాలు.. వణుకు పుట్టిస్తున్న బాబా వంగా అంచనాలు
2026లో ఊహించని సంచలనాలు.. వణుకు పుట్టిస్తున్న బాబా వంగా అంచనాలు
పెరుగుతో కలిపి తినకూడని పదార్థాలు ఇవే.. ఎందుకంటే..
పెరుగుతో కలిపి తినకూడని పదార్థాలు ఇవే.. ఎందుకంటే..
T20 World Cup 2026: ఛీ కొట్టిన ప్లేయరే బీసీసీకి దిక్కయ్యాడుగా..
T20 World Cup 2026: ఛీ కొట్టిన ప్లేయరే బీసీసీకి దిక్కయ్యాడుగా..
ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే కుక్కలను పెంచుకోవచ్చా..?
ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే కుక్కలను పెంచుకోవచ్చా..?
చివరి రోజుల్లో నన్ను పిలిచి అలా చేశాడు.. బ్రహ్మానందం కన్నీళ్లు..
చివరి రోజుల్లో నన్ను పిలిచి అలా చేశాడు.. బ్రహ్మానందం కన్నీళ్లు..