1000 కేజీల బాంబులతో భారత్ భీకర దాడి

1000 కేజీల బాంబులతో భారత్ భీకర దాడి

న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై భారత దేశం యుద్ధం చేస్తోంది. ఉగ్రవాద శిభిరాలపై భీకర దాడి చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో వెయ్యి కేజీల బరువు గల బాంబులతో సర్జికల్ స్ట్రైక్ చేసింది. వాయుసేన శక్తిని ఉగ్ర మూఖలకు చూపిస్తూ చొచ్చుకుపోతోంది. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలే లక్ష్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత వాయుసేన బాంబుల వర్షం కురిపిస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి భారత యుద్ధ విమానాలు వచ్చినట్టు పాకిస్థాన్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. అయితే భారత రక్షణ […]

Vijay K

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:23 PM

న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై భారత దేశం యుద్ధం చేస్తోంది. ఉగ్రవాద శిభిరాలపై భీకర దాడి చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో వెయ్యి కేజీల బరువు గల బాంబులతో సర్జికల్ స్ట్రైక్ చేసింది. వాయుసేన శక్తిని ఉగ్ర మూఖలకు చూపిస్తూ చొచ్చుకుపోతోంది. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలే లక్ష్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత వాయుసేన బాంబుల వర్షం కురిపిస్తోంది.

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి భారత యుద్ధ విమానాలు వచ్చినట్టు పాకిస్థాన్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. అయితే భారత రక్షణ శాఖ మాత్రం ఈ దాడి గురించి అధికారికంగా ప్రకటించలేదు. ఈ దాడి తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు జరిగినట్టు తెలుస్తోంది.

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి దూసుకెళ్లిన భారత వాయిసేన ఉగ్రవాద శిభిరాలే లక్ష్యంగా దాడులకు దిగింది. మొత్తం 12 మిరాజ్ యుద్ధ విమానాలతో దాడులు చేసింది. జైషూ మహ్మద్ ఉగ్ర సంస్థను టార్గెట్ చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో మూడు ప్రాంతాలు భీంబర్, బాలాకోట్, భవాల్పూర్‌లలో ఉన్న ఉగ్రవాద శిభిరాలను ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu