కొత్త సెక్రెటేరియట్ వద్దన్న పిటిషనర్‌కు హైకోర్టు అక్షింతలు
తెలంగాణ ప్రభుత్వ పాలనా యంత్రాంగం కోసం కొత్త సచివాలయాన్ని నిర్మించాలనుకున్న ముఖ్యమంత్రి కెసీఆర్ నిర్ణయానికి మోకాలడ్డుతున్న పిటీషనర్‌కు హైదరాబాద్ హైకోర్టు అక్షింతలు వేసింది. సచివాలయం కూల్చివేత పై హైకోర్టు లో బుధవారం విచారణ జరిగింది. సచివాలయం భవనాల పై టెక్నీకల్ రీపోర్ట్ ను ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. సచివాలయం లో ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరాయని ప్రభుత్వం టెక్నికల్ రిపోర్టులో పేర్కొంది. అందుకే నూతన సచివాలయంలో నిర్మిస్తున్నామని తెలిపింది. ఏడేళ్ల క్రితం నిర్మించిన H బ్లాక్ ను ఎందుకు కూల్చివేస్తున్నారని హైకోర్టు ఎదురు […]
తెలంగాణ ప్రభుత్వ పాలనా యంత్రాంగం కోసం కొత్త సచివాలయాన్ని నిర్మించాలనుకున్న ముఖ్యమంత్రి కెసీఆర్ నిర్ణయానికి మోకాలడ్డుతున్న పిటీషనర్‌కు హైదరాబాద్ హైకోర్టు అక్షింతలు వేసింది. సచివాలయం కూల్చివేత పై హైకోర్టు లో బుధవారం విచారణ జరిగింది. సచివాలయం భవనాల పై టెక్నీకల్ రీపోర్ట్ ను ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. సచివాలయం లో ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరాయని ప్రభుత్వం టెక్నికల్ రిపోర్టులో పేర్కొంది. అందుకే నూతన సచివాలయంలో నిర్మిస్తున్నామని తెలిపింది. ఏడేళ్ల క్రితం నిర్మించిన H బ్లాక్ ను ఎందుకు కూల్చివేస్తున్నారని హైకోర్టు ఎదురు ప్రశ్నించింది.
ప్రభుత్వాన్ని. సుమారు 10 లక్షల ఏసేఫ్టీ తో ఇంటిగ్రేటెడ్ సెక్రెటరేట్ నిర్మిస్తున్నామని ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకో రాదని రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదిస్తున్న అడ్వకేట్ తేల్చిచెప్పారు. దాంతో హైకోర్టు బెంచ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తాము ఎలా జోక్యం చేసుకోవాలో తెలపాలని పిటిషనర్ ను కోరింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టబద్ధంగా, చట్టవ్యతిరేకమై ఉన్నాయా లేవా తెలపాలని పిటిషనర్‌ను న్యాయమూర్తి ప్రశ్నించడంతో పిటీషనర్ నీళ్ళు నమిలినట్లు తెలిసింది. కేసు తదుపరి విచారణ అక్టోబర్ 21 కి వాయిదా వేశారు.