బాబు ప్రశ్నలతో బిక్కమొహం.. టిడిపి సమీక్షల తీరే వేరు !
చంద్రబాబు ఆరా తీస్తున్నారు. అక్కడా ఇక్కడా కాదు.. పార్టీ శ్రేణుల సమావేశాల్లోనే.. ఇంతకీ ఏంటంటారా ? ఇది చదవండి.. ఒకటి కాదు రెండు కాదు. 151 సీట్లు పోయాయి. ఏకంగా నాలుగు జిల్లాలు క్లీన్ స్వీప్ అయ్యాయి. ఇంత ఘోర ఓటమి వెనుక కారణాలేంటి? అసలు ఎన్నికల్లో ఏం జరిగింది? అని ఇటీవల సమీక్షల పేరిట చంద్రబాబు ఆరా తెలుసుకుంటున్నారు. టీడీపీ ఓటమికి సింహపురిలో కార్యకర్తలు అసలు నిజాలు చెప్పారట. ఇంతకీ కార్యకర్తలు చెప్పిన విషయాలేంటి? ఏపీ […]
చంద్రబాబు ఆరా తీస్తున్నారు. అక్కడా ఇక్కడా కాదు.. పార్టీ శ్రేణుల సమావేశాల్లోనే.. ఇంతకీ ఏంటంటారా ? ఇది చదవండి..
ఒకటి కాదు రెండు కాదు. 151 సీట్లు పోయాయి. ఏకంగా నాలుగు జిల్లాలు క్లీన్ స్వీప్ అయ్యాయి. ఇంత ఘోర ఓటమి వెనుక కారణాలేంటి? అసలు ఎన్నికల్లో ఏం జరిగింది? అని ఇటీవల సమీక్షల పేరిట చంద్రబాబు ఆరా తెలుసుకుంటున్నారు. టీడీపీ ఓటమికి సింహపురిలో కార్యకర్తలు అసలు నిజాలు చెప్పారట. ఇంతకీ కార్యకర్తలు చెప్పిన విషయాలేంటి?
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి ఐదు నెలలైంది. ఇప్పుడు పార్టీ ఓటమిపై సమీక్షలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు మొదలుపెట్టారు. కార్యకర్తలపై అధికారపార్టీ నేతల దాడులు, బాధితులకు పరామర్శ పేరుతో చంద్రబాబు జిల్లాల పర్యటనలు చేపట్టారు. తూర్పుగోదావరితో మొదలైన ఈపర్యటనలు విశాఖ, నెల్లూరు జిల్లాలో కొనసాగాయి. రెండు రోజుల పాటు పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
నియోజకవర్గాల వారీగా సమీక్ష, కార్యకర్తల కుటుంబాలకు భరోసా ఇచ్చే ప్రయత్నం ఈ సమావేశాల్లో జరిగింది. ఇదంతా ఒక ఎత్తయితే…నెల్లూరు జిల్లాలో పార్టీ ఓటమికి కారణాలు ఏంటి? అని చంద్రబాబు నేతలను అడిగారట. జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు ఎంపీ సీట్లను వైసీపీ గెలుచుకుంది. పార్టీ ఇంతగా నష్టపోవడానికి రీజన్స్ ఏంటి? అని నేతలను సూటిగా చంద్రబాబు ప్రశ్నించారట. దీంతో కొందరు నేతలు సమాధానం చెప్పలేక బిక్కమొహం వేశారట.
అయితే కొంతమంది నేతలు మాత్రం మనసు విప్పి మాట్లాడారట. పార్టీ అధిష్టానం పరంగానే తప్పులు జరిగాయని…తప్పులు అన్నీ మీరే చేసి మమ్ముల్ని అడగడం బాగాలేదని కొందరు వాదనలు వినిపించారట. కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల మార్చాలని ఎన్నికల ముందు పదేపదే చెప్పిన పట్టించుకోలేదని…ఏకపక్షంగా అభ్యర్తులను నిర్ణయించి తమపై రుద్దారని కొందరు కార్యకర్తుల వాపోయారట. ఇప్పుడు తాము వద్దన్న నేతలు పోటీలోకి దించి…వారు ఓడిపోతే తమని అడగడం బాగాలేదని అన్నారట.
సూళ్లూరుపేటలో వైసీపీకి 61వేల మెజార్టీ ఎలా వచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారట. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులు వెంటనే జోక్యం చేసుకుని…క్యాండేట్‌ను మార్చామని పదేపదే విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని…దాని ఫలితమే 61వేల మెజార్టీ అని చెప్పారట. ఎన్నికల ముందు రిజల్ట్ ముందే ఊహించి చెబితే…అధిష్టానం పట్టించుకోలేదని..ద్వితీయ శ్రేణి నాయకత్వం సూచనలకు కనీసం విలువ ఇవ్వలేదని వాపోయారట. అధిష్టానం తప్పులు చేసి …ఇప్పుడు సమీక్షల పేరిట తమ తప్పు చేశామని కలరింగ్ ఇవ్వడం బాగోలేదని సమావేశంలో కార్యకర్తలు కుండబద్దలు కొట్టారని తెలుస్తోంది.
జిల్లాలో ద్వితీయ శ్రేణి నాయకత్వానికి పార్టీ పరంగా సపోర్టు లేదని..ఇలాంటి పరిస్థితుల్లో ఆఫర్లు వస్తే పక్కపార్టీకి జంప్ కావడానికి నేతలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు ముందే కొందరు కార్యకర్తలు చెప్పినట్లు సమాచారం. మొత్తానికి నెల్లూరు సమీక్షా సమావేశాలు వాడివేడిగా జరిగాయని తెలుస్తోంది.