వలస కార్మికులపై హైకోర్టు కీలక కామెంట్

లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులు, కూలీలు, కుటుంబాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్ ప్రబలడం తో దేశవ్యాప్తంగా మార్చి ఆఖరు వారంలో ఉన్నట్టుండి లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో లో గత నెల రోజులుగా వలస జీవితాలు పడుతున్న దుర్భర సమస్యలపై తెలంగాణ హైకోర్టు స్పందించింది.

వలస కార్మికులపై హైకోర్టు కీలక కామెంట్
Follow us

|

Updated on: Apr 27, 2020 | 7:13 PM

లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులు, కూలీలు, కుటుంబాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్ ప్రబలడం తో దేశవ్యాప్తంగా మార్చి ఆఖరు వారంలో ఉన్నట్టుండి లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో లో గత నెల రోజులుగా వలస జీవితాలు పడుతున్న దుర్భర సమస్యలపై తెలంగాణ హైకోర్టు స్పందించింది.

వలస కార్మికుల ఇబ్బందులపై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. పలు స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులను కోర్టు దృష్టికి తీసుకు వచ్చాయి. ఈ విషయంపై పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలయిన. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు, సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతించాలని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని వలస కార్మికులను వారి వారి స్వస్థలాలకు పంపించడం సాధ్యం కాదా అని ప్రభుత్వాలను ప్రశ్నించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి ఈ విషయంలో సమగ్రమైన అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు సూచించింది.

తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకొని కోర్టుకు నివేదించారు అని అడ్వకేట్ జనరల్ ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మే 11వ తేదీకి వాయిదా వేసింది.