AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్ళీ ఇబ్బందుల్లో ఫేస్‌బుక్.. యూజర్ల డేటాకు నో సేఫ్టీ

ప్రపంచంలో మేటి సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్‌కు మరోసారి పెద్ద షాక్ తగిలింది. తమకున్న కోట్లాది వినియోగదారుల డేటాను ఫేస్ బుక్ పరిరక్షించలేదని మరోసారి స్ఫష్టమైంది. ఫేస్ బుక్ వినియోగదారుల సమాచారం వేరే వెబ్ సైట్ల చేతుల్లోకి వెళ్ళి పోయినట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ తాజాగా వెల్లడించింది.

మళ్ళీ ఇబ్బందుల్లో ఫేస్‌బుక్.. యూజర్ల డేటాకు నో సేఫ్టీ
Rajesh Sharma
|

Updated on: Apr 27, 2020 | 5:56 PM

Share

ప్రపంచంలో మేటి సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్‌కు మరోసారి పెద్ద షాక్ తగిలింది. తమకున్న కోట్లాది వినియోగదారుల డేటాను ఫేస్ బుక్ పరిరక్షించలేదని మరోసారి స్ఫష్టమైంది. ఫేస్ బుక్ వినియోగదారుల సమాచారం వేరే వెబ్ సైట్ల చేతుల్లోకి వెళ్ళి పోయినట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ తాజాగా వెల్లడించింది.

డేటా లీక్ స్కామ్ విషయంలో గత కొంతకాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్ మరోసారి లీకుల ఇబ్బందుల్లో పడింది. వరల్డ్ వైడ్‌గా కోట్లాది మంది యూజర్ల ఇన్ఫర్మేషన్ అత్యంత చీప్‌‌గా అమ్ముడు పోయిందన్న న్యూస్ గుప్పుమంది. ఈ న్యూస్ యూజర్లలో ఆందోళన రేపుతోంది. సుమారు 26 కోట్ల మందికి పైగా ఫేస్‌బుక్ యూజర్ల ప‌ర్స‌న‌ల్ డేటా ‘డార్క్ వెబ్’ అనే సైబర్ సంస్థ గుప్పిట్లోకి వెళ్ళినట్లు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘సైబుల్’ ప్రకటించింది. యూజర్ల ఐడీలు, పూర్తి పేర్లు, ఈ మెయిల్స్, వ్యక్తిగత అడ్రస్‌లు, వయసు, రిలేషన్ షిప్ స్టేటస్‌లతో వంటి అన్ని వివరాలు ‘డార్క్ వెబ్’ సంస్థకు విక్రయించినట్టు పేర్కొంది. ప్రస్తుతానికి, ఈ డేటా ఉల్లంఘనకు కారణం తెలియనప్పటికీ ఫేస్‌బుక్‌లోని థర్డ్ పార్టీ ఏపీఐ లోపాల ఆధారంగా ఈ డేటాను చోరీ చేసే అవకాశం ఉందని సైబుల్ చెబుతోంది.

ఫేస్‌బుక్ వినియోగదారుల డేటా ‘డార్క్ వెబ్’లో అమ్మకానికి పెట్టినట్టుగా తెలుస్తోంది. 30 కోట్ల మంది యూజర్ల డేటా లీక్ కావడంపై ప్రపంచ వ్యాప్తంగా దిగ్బ్రాంతి వ్యక్తమవుతోంది. ప్రొఫైల్‌తో పాటు డార్క్ వెబ్లో అందుబాటులోకి వచ్చేసిందని, దాంట్లో 26 కోట్ల మంది యూజర్ల డేటా జస్ట్ 543 డాలర్లకే అంటే కేవలం 4,138 కోట్ల రూపాయలకే లభ్యమవడం సెక్యూరిటీ భద్రతను ప్రశ్నార్థకంలో పడేస్తుందని సైబుల్ తెలిపింది. ఇన్ని షాకింగ్ ఎలిమెంట్లను వెల్లడించిన సైబుల్ ఒక్క శుభవార్తను కూడా యూజర్లకు అందించింది. ఫేస్ బుక్ యూజర్ల పాస్ వర్డులు మాత్రం భద్రంగా ఉన్నాయని, యూజర్ల డేటాను రక్షణకు కఠిన పద్దతులను పాటించాలని సూచించింది.