AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.300 తో ఇంట్లో నుంచి పారిపోయి…ఇప్పుడు సౌత్ ఇండియా స్టార్ హీరో..

‘కేజీఎఫ్ మూవీ ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఊహించ‌ని ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సైలెంట్ గా వ‌చ్చి హీరో యశ్ ఓవ‌ర్ నైట్ సూప‌ర్ స్టార్ అయిపోయాడు. అంత‌క‌ముందు వ‌రకు ఈ హీరో పేరు ఒక్క క‌న్న‌డ‌లో త‌ప్ప బ‌య‌ట ఎక్క‌డా వినిపించేది కాదు. కానీ ఇప్పుడు య‌శ్ అంటే ఓ సెన్సేష‌న్. కేజీఎఫ్ సినిమా అత‌డి కెరీర్ మొత్తాన్ని మార్చేసింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కోసం ఆడియెన్స్ ఓ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారు. క‌న్న‌డ […]

రూ.300 తో ఇంట్లో నుంచి పారిపోయి...ఇప్పుడు సౌత్ ఇండియా స్టార్ హీరో..
Ram Naramaneni
|

Updated on: Apr 27, 2020 | 3:13 PM

Share

‘కేజీఎఫ్ మూవీ ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఊహించ‌ని ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సైలెంట్ గా వ‌చ్చి హీరో యశ్ ఓవ‌ర్ నైట్ సూప‌ర్ స్టార్ అయిపోయాడు. అంత‌క‌ముందు వ‌రకు ఈ హీరో పేరు ఒక్క క‌న్న‌డ‌లో త‌ప్ప బ‌య‌ట ఎక్క‌డా వినిపించేది కాదు. కానీ ఇప్పుడు య‌శ్ అంటే ఓ సెన్సేష‌న్. కేజీఎఫ్ సినిమా అత‌డి కెరీర్ మొత్తాన్ని మార్చేసింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కోసం ఆడియెన్స్ ఓ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారు. క‌న్న‌డ చిత్ర‌పరిశ్ర‌మ స్థాయినే పెంచేసిన య‌శ్..తాజాగా త‌న చిన్ననాటి నుంచి ఆస‌క్తిక‌ర విష‌యాలను పంచుకున్నాడు. త‌న చిన్న‌ప్పుడు రూ.300 తో ఇంట్లో నుంచి పారిపోయాడ‌ట ఈ స్టార్ హీరో. యాక్ట‌ర్ కావాల‌నే ఉద్దేశ్యంతోనే అలా పారిపోయి బెంగుళూరు వ‌చ్చాడ‌ట‌. కానీ వ‌చ్చిన తొలినాళ్లో ఎన్నో ఇబ్బందులు అత‌డ్ని వెంటాడ‌య‌ట‌.

“నేను ఇంటి నుంచి పారిపోయి బెంగళూరుకు వచ్చేశా. అక్క‌డ‌కు వెళ్లిన తర్వాత ఇంత పెద్ద న‌గ‌రంలో ఎలా బ్ర‌త‌కాలా అని చాలా భయపడ్డా. కానీ, ఎప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని కొల్పోలేదు. సమస్యలకు వెన‌క‌డుగు వెయ్య‌లేదు. బెంగళూరుకు చేరుకునేస‌రికి నా జేబులో కేవలం రూ.300 మాత్రమే ఉన్నాయి. ఆ సమయంలో తిరిగి వెళితే, తల్లిదండ్రులు ముఖం చూపించ‌లేను. అందుకే యాక్ట‌ర్ గా నా ల‌క్ టెస్ట్ చేసుకోవాలి అనుకున్నా. ఒకవేళ యాక్ట‌ర్ కాలేకపోతే.. నా తల్లిదండ్రులు ఏం చెబితే అది చేయాల్సిన పరిస్థితి. అయితే నేను తిరిగి వచ్చేస్తానని వారు భావించారు. ల‌క్కీగా ఓ వ్యక్తి నన్ను థియేటర్‌లోకి తీసుకున్నాడు. ఆ సమయంలో ఆ ప‌ని గురించి నాకు ఏమి తెలియ‌దు. పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ డబ్బులు సంపాదించడం మొదలుపెట్టా. టీ అందించ‌డం నుంచి ఎన్నో ర‌కాల పనులు చేశా.. ఎన్నో ప్రదేశాలు తిరిగా. స్టేజీపై నా తొలి ప్రదర్శనను గుర్తించి, అవకాశం ఇచ్చారు” అని య‌శ్ త‌న లైఫ్ లోని మూమెంట్స్ పంచుకున్నారు.

Follow Us
భారత్‌లో డెబ్యూ మ్యాచ్ ఇప్పట్లో లేనట్టే వైభవ్.. అసలు విలన్ ఎవరు?
భారత్‌లో డెబ్యూ మ్యాచ్ ఇప్పట్లో లేనట్టే వైభవ్.. అసలు విలన్ ఎవరు?
దేవుడి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో సేవ బుక్ చేస్తున్నారా..? జాగ్రత్త!
దేవుడి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో సేవ బుక్ చేస్తున్నారా..? జాగ్రత్త!
ఎట్టకేలకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరట!
ఎట్టకేలకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరట!
కీలక నిర్ణయం.. ఇక 9 నెలల గడువు.. బైక్‌ ట్యాక్సీలకు కొత్త రూల్స్‌
కీలక నిర్ణయం.. ఇక 9 నెలల గడువు.. బైక్‌ ట్యాక్సీలకు కొత్త రూల్స్‌
మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానం.. కేంద్ర కేబినెట్ కీలక తీర్మానం..
మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానం.. కేంద్ర కేబినెట్ కీలక తీర్మానం..
కొండ ప్రాంతంలో 1 BHK ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చవుతుంది?
కొండ ప్రాంతంలో 1 BHK ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చవుతుంది?
యాక్సిడెంట్ తర్వాత పండు మాస్టర్ ఫస్ట్ వీడియో.. కన్నీళ్లు ఆగవు
యాక్సిడెంట్ తర్వాత పండు మాస్టర్ ఫస్ట్ వీడియో.. కన్నీళ్లు ఆగవు
దీని విలువ తెలియక దొంగలు కూడా వదిలేశారు..
దీని విలువ తెలియక దొంగలు కూడా వదిలేశారు..
స్త్రీ శక్తి పథకం సూపర్ హిట్..100 కోట్ల ఉచిత ప్రయాణాలతో రికార్డ్!
స్త్రీ శక్తి పథకం సూపర్ హిట్..100 కోట్ల ఉచిత ప్రయాణాలతో రికార్డ్!
అక్టోబర్‌ 15 వచ్చేస్తోంది.. ఇవి తప్పకుండా తెలుసుకోవాల్సిందే..!
అక్టోబర్‌ 15 వచ్చేస్తోంది.. ఇవి తప్పకుండా తెలుసుకోవాల్సిందే..!