AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ కాళ్లలో వాపులున్నాయా? నిర్లక్ష్యం చేస్తే డేంజరే..!

సమస్య చిన్నదిగానే కనిపిస్తుంది.. కానీ దాని ప్రతిఫలం మాత్రం చాల ఘోరంగా ఉంటుంది. అదే కాళ్లవాపు దీన్నే ఎడీమా అని కూడా అంటారు. మధ్య వయసులో ఉన్నవారు తమ కాళ్లు వాచిపోతున్నాయని, కారణమేంటో అర్ధం కావడంలేదని బాధపడుతుంటారు. అయితే కాళ్ల వాపులే కదా ఈజీగా తీసుకుంటే మాత్రం ప్రాణానికే ప్రమాదం కావచ్చంటున్నారు వైద్యులు. కాళ్ల వాపు సమస్య ఉన్నట్టయితే అది భవిష్యత్తులో గుండె జబ్బుకు దారితీయోచ్చని హెచ్చిరిస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.. కాళ్లవాపు అనేది గుండెజబ్బులకు ప్రధాన […]

మీ కాళ్లలో వాపులున్నాయా? నిర్లక్ష్యం చేస్తే డేంజరే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 05, 2019 | 7:23 PM

Share

సమస్య చిన్నదిగానే కనిపిస్తుంది.. కానీ దాని ప్రతిఫలం మాత్రం చాల ఘోరంగా ఉంటుంది. అదే కాళ్లవాపు దీన్నే ఎడీమా అని కూడా అంటారు. మధ్య వయసులో ఉన్నవారు తమ కాళ్లు వాచిపోతున్నాయని, కారణమేంటో అర్ధం కావడంలేదని బాధపడుతుంటారు. అయితే కాళ్ల వాపులే కదా ఈజీగా తీసుకుంటే మాత్రం ప్రాణానికే ప్రమాదం కావచ్చంటున్నారు వైద్యులు. కాళ్ల వాపు సమస్య ఉన్నట్టయితే అది భవిష్యత్తులో గుండె జబ్బుకు దారితీయోచ్చని హెచ్చిరిస్తున్నారు.

నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే..

కాళ్లవాపు అనేది గుండెజబ్బులకు ప్రధాన లక్షణంగా వైద్యులు చెబుతున్నారు. దీన్ని కొంచెం నిర్లక్ష్యం చేసినా ప్రాణానికే ప్రమాదం కావచ్చంటున్నారు. కాళ్ల వాపులు అనేవి ప్రారంభంలో కాళ్ల మడిమెల వద్ద, ఆ తర్వాత పాదం వద్ద వస్తాయి. అయితే నొప్పి ఉండకపోవడంతో దీన్ని పెద్దగా పట్టించుకోరు. ఆ తర్వాత కొద్ది రోజులకు శ్వాస తీసుకోకపోవడం, ఛాతీలో నొప్పి రావడం, నడవలేక పోవడం వంటి సమస్యలు వచ్చినప్పుడు మాత్రం వెంటనే డాక్టర్లను సంప్రదిస్తారు. అప్పుడు వారిని పరీక్షించి అసలు దీనికి కారణం కాళ్ల వాపులో ఉందని వైద్యులు గుర్తించగలుగుతారు.

కాళ్లలో వాపులు ఎందుకు వస్తాయి? 

రోజు మొత్తంలో నిలబడి పనులు చేయడం, ఎక్కవ సేపు అలాగే నిలబడి ఉండటం వంటివాటి వల్ల కాళ్లలో ఉన్న సిరల్లో రక్తం పేరుకుపోతుంది. దీంతో పైకి ఎగబాకవలసిన రక్తం కాళ్లలో ఉన్న సిరల్లో గడ్డకట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల కాళ్లు వాపులు ఏర్పడతాయి. పైగా ఇదే సమస్య గుండె సంబంధ సమస్యలకు కారణమవుతుంది. కాళ్లలో రక్తం గడ్డకట్టుకుపోవడం వల్ల ఆయా నరాల్లో టాక్సిన్స్ శరీరంలోకి విడుదల అవుతాయి. డీ ఆక్సీజనేటెడ్ రక్తం గుండె నుంచి వివిధ అవయవాలకు పంపిణీ చేస్తుంది. ఒకవేళ కాళ్లలో గడ్డలు ఏర్పడటం వల్ల డీ ఆక్సిజనేటెడ్ రక్తం అందకపోతే రక్తం స్ధానంలో నీరు వచ్చి చేరుతుంది. అప్పుడు కాళ్లలో వాపులు వస్తాయి. ముఖ్యంగా ఇటువంటి సమస్య మధ్య వయసులో ఉన్నవారిలోనూ, రోజు మొత్తంలో ఎక్కువ సేపు నిలబడి ఉండేవారిలో, అలాగే ఊబకాయంతో ఉన్నవారిలో కనిపిస్తుంది.

కాళ్ల వాపు సమస్యతో బాధపడేవారు ఎక్కువసేపు నిలబడి ఉండకూడదు, కాళ్లలో ఉన్న సిరల్లో రక్తం పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సమస్య మరీ ఎక్కువగా ఉంటే వైద్యుణ్ని సంప్రదించాలి. కాళ్ల వాపు అనేది సహజమే కదా.. అని నిర్లక్ష్యం చేస్తేమాత్రం అది గుండె జబ్బులకు దారితీసే ఛాన్స్ ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.