ఆ యువకుడు అలా మారిపోడానికి ఆ ఫోనే కారణమట..!
అనుకున్నదొక్కటీ .. అయినది ఒక్కటీ.. అనేలా తయారైంది ఓ యువకుని పరిస్థితి. సాధారణంగా అంతా వినియోగించే ఓ కాస్ట్లీ మొబైల్ ఫోన్ తనను స్వలింగ సంపర్కునిగా మార్చిందంటూ గగ్గోలు పెడుతున్నాడు. మొబైల్ ఫోన్ ఏంటీ?.. స్వలింగ్ సంపర్కునిగా మార్చడమేంటీ అనుకుంటున్నారా? అయితే ఇది పూర్తిగా చదివితే మీకే అర్ధమవుతుంది. అసలు విషయానికి వస్తే.. యాపిల్ సంస్ధ ప్రెస్టీజియస్ ప్రోడక్ట్ ఐ ఫోన్. ఇది వినిగించడంలో సరైన అవగాహన లేకపోవడంతో రష్యాకు చెందిన ఓ యువకుడు గే గా […]
అనుకున్నదొక్కటీ .. అయినది ఒక్కటీ.. అనేలా తయారైంది ఓ యువకుని పరిస్థితి. సాధారణంగా అంతా వినియోగించే ఓ కాస్ట్లీ మొబైల్ ఫోన్ తనను స్వలింగ సంపర్కునిగా మార్చిందంటూ గగ్గోలు పెడుతున్నాడు. మొబైల్ ఫోన్ ఏంటీ?.. స్వలింగ్ సంపర్కునిగా మార్చడమేంటీ అనుకుంటున్నారా? అయితే ఇది పూర్తిగా చదివితే మీకే అర్ధమవుతుంది.
అసలు విషయానికి వస్తే.. యాపిల్ సంస్ధ ప్రెస్టీజియస్ ప్రోడక్ట్ ఐ ఫోన్. ఇది వినిగించడంలో సరైన అవగాహన లేకపోవడంతో రష్యాకు చెందిన ఓ యువకుడు గే గా మారిపోయాడు. అతికొద్ది మంది మాత్రమే ఉపయోగించే ఐ ఫోన్‌లో ఎన్నో యాప్స్ అందుబాటులో ఉంటాయి. వీటిని సరిగ్గా అర్ధం చేసుకోకపోతే తప్పులో కాలేసినట్టే. సరిగ్గా రష్యాకు చెందిన యువకుడికి ఇదే పరిస్థితి ఎదురైంది. ఐ ఫోన్‌లో క్రిప్టో కరెన్సీకి సంబంధించి గే కాయిన్ అనేదాన్ని అర్ధం చేసుకోవడంలో పొరబాటు పడ్డాడు. తన ఐ ఫోన్‌లో ఉన్న యాప్ ద్వారా బిట్ కాయిన్‌కు ఆర్డర్ ఇచ్చాడు. అయితే అతడికి క్రిప్టో కరెన్సీలోని గే కాయిన్ వచ్చింది. నిజానికి అతడు ఆర్డర్ చేసింది ఒకటైతే.. వచ్చింది మాత్రం మరొకటి. అయితే తనకు వచ్చిన గే కాయిన్ క్రిప్టో కరెన్సీపై “ప్రయత్నించకుండా ఒక అభిప్రాయానికి రావద్దు” అనే నోట్ ఉంది. ఇది చదివిన ఆ యువకుడి మైండ్‌కి వెంటనే ఓ ఆలోచన వచ్చింది.. దేన్నయినా ప్రయత్నించకపోతే ఎలా తెలుస్తుంది.. అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా వెంటనే హోమో సెక్సువల్ సంబంధాల కోసం ప్రయత్నించాడు. ఈ ప్రయత్నాలు ఫలించి ఓ బాయ్ ఫ్రెండ్ కూడా దొరికాడు. ఇంకేముంది ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేశారు.
ఇప్పుడు ఈ యువకుడి మనసు మారింది. తాను తప్పు చేస్తున్నాను అనే భావన వేధించడం మొదలుపెట్టింది . హోమో సెక్సువల్‌గా మారిపోయిన సంగతి తన తల్లిదండ్రులకు ఎలా చెప్పాలో అర్ధం కాక హైరానా పడుతున్నాడు. తాను మునుపటిలా ఇక ఎన్నటికీ ఉండలేనని, తన జీవితంలో ఇటువంటిది జరగడానికి ఐ ఫోనే కారణమని ఆరోపిస్తున్నాడు. తను ఇలా మారిపోడానికి ఐ ఫోనే కారణమని ఆరోపిస్తూ ఏకంగా ఆ కంపెనీపైనే కేసు వేశాడు. ఆ యాప్ తన జీవితాన్ని అథోగతి పాలు చేసిందని , దీనివల్ల తాను ఎంతో మనసిక వేదన, నైతికంగా తలెత్తుకు తిరగలేని పరిస్థితి ఏర్పడిందంటూ రోదిస్తున్నాడు. దీనికి పరిహారంగా పది లక్షల రూబుళ్లు (10.97 లక్షల రూపాయలు) చెల్లించాలని డిమాండ్ చేశాడు.
రష్యాలో జరిగిన ఈ ఘటనలొ ఆ యువకుడు గత నెల సెప్టెంబర్ 20న పిటిషన్ దాఖలు చేయగా అక్టోబర్‌లో 17న ఈ కేసు విచారణకు రానుంది. రష్యాలో ప్రకృతికి విరుద్ధంగా సాగే జీవన శైలిని 2013లో నిషేధం విధించారు. దీంతో అక్కడ ఎంతోమంది LGBT గ్రూప్‌లకు చెందిన వారు హత్య చేయబడిన దాఖలాలున్నాయి.