దేశ వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు, క‌ర్నాట‌క‌కి ఎల్లో అలెర్ట్

దేశ వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు, క‌ర్నాట‌క‌కి ఎల్లో అలెర్ట్

ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా వాన‌లు దంచి కొడుతున్నాయి. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ ప్ర‌తీ రోజూ భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. న‌దుల‌న్నీ ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తూండ‌టంతో.. ప్రాజెక్టుల‌కు జ‌ల‌క‌ళ సంత‌రించుకుంది. అయితే తాజాగా దేశ వ్యాప్తంగా మ‌రో మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 12, 2020 | 4:38 PM

ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా వాన‌లు దంచి కొడుతున్నాయి. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ ప్ర‌తీ రోజూ భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. న‌దుల‌న్నీ ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తూండ‌టంతో.. ప్రాజెక్టుల‌కు జ‌ల‌క‌ళ సంత‌రించుకుంది. అయితే తాజాగా దేశ వ్యాప్తంగా మ‌రో మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు భార‌త వాత‌వ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. వాయువ్య భార‌త‌దేశంలో ప్ర‌ధానంగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్, ఉత్త‌రాఖండ్‌, పంజాబ్, హ‌ర్యానా, చండీగ‌ఢ్‌, ఢిల్లీ, యూపీలోని ప‌లు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ విభాం సూచించింది.

అలాగే ఈ నెల 12 నుంచి 15 వ‌ర‌కు గుజ‌రాత్, తూర్పు రాజ‌స్థాన్ మ‌ధ్య కొన్ని ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు, కొంక‌ణ్, ఉత్త‌ర గోవాలో అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌రణ శాఖ వెల్ల‌డించింది. ఇక రాబోయే 24 గంట‌ల్లో తూర్పు రాజ‌స్థాన్‌, ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని కొన్ని చోట్ల మెరుపులు, ఉరుములతో పాటు బ‌ల‌మైన ఈదుగురు గాలుల‌తో కూడిన వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని పేర్కొంది భార‌త వాతావ‌ర‌ణ శాఖ‌.

మ‌రోవైపు ఈ నెల 12 నుంచి 16 వ‌ర‌కు ఉత్త‌ర క‌న్న‌డ‌, ఉడిపి, ద‌క్షిణ క‌న్న‌డ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని క‌ర్ణాట‌క‌లోని భార‌త వాతావ‌ర‌ణ విభాగం తెలిపింది. ఈ నేప‌థ్యంలో తీర ప్రాంత జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేసిన‌ట్లు పేర్కొంది. అలాగే లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. మ‌త్స్య‌కారులు చేప‌ల వేట‌కు వెల్ల‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించింది.

Read More:

బాలీవుడ్ ప్ర‌ముఖ‌ ద‌ర్శ‌కుడి ఆరోగ్యం విష‌మం

రేప్ చేస్తామ‌ని క్రికెట‌ర్ షమీ భార్య‌కు బెదిరింపులు

క‌రోనాతో మ‌ర‌ణించిన మాజీ ఎమ్మెల్యే మ‌న‌వ‌ళ్లు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu