కరోనాకు మరో లక్షణం.. ఎక్కిళ్లు కూడా కారణమట..!

కరోనాకు మరో లక్షణం.. ఎక్కిళ్లు కూడా కారణమట..!

కరోనా లక్షణాల్లో శ్వాస సంబంధిత వ్యాధి, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపించేవి. ఆ తర్వాతి రోజుల్లో కండ్లు ఎర్రబడటం కావడం కూడా ఒక లక్షణంగా నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆగకుండా ఎక్కిళ్లు రావడం కూడా కరోనా వైరస్ సోకినట్లేనని అంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు.

Balaraju Goud

|

Aug 12, 2020 | 4:31 PM

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారికి ఇప్పడిప్పుడే చెక్ పెట్టేందుకు వాక్సిన్ మార్గం దొరికింది. అనేక దేశాలు కరోనా తరిమికొట్టేందుకు మందు కనిపెట్టే పనిలో పడ్డాయి. అయితే, అటు కరోనా వైరస్ కొత్త రూపు సంతరించుకుంటుందని అమెరికా శాస్త్రవేత్తలు అంటున్నారు. మొదట్లో కరోనా లక్షణాల్లో శ్వాస సంబంధిత వ్యాధి, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపించేవి. ఆ తర్వాతి రోజుల్లో కండ్లు ఎర్రబడటం కావడం కూడా ఒక లక్షణంగా నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆగకుండా ఎక్కిళ్లు రావడం కూడా కరోనా వైరస్ సోకినట్లేనని అంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు.

అమెరికన్ జర్నల్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. చికాగోకు చెందిన ఓ 62 ఏండ్ల వ్యక్తి నాలుగు రోజులుగా ఎక్కిళ్ల సమస్యతో బాధపడుతున్నాడు. అయితే, అతడిలో కరోనా వైరస్ కు సంబంధించిన ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. అతన్ని పరీక్షించిన వైద్యులు అతనికి కొవిడ్ సోకిందని టెస్టుల్లో తేల్చారు. జ్వరం వచ్చిన తరువాత అతడ్ని చెకప్ కోసం హాస్పిటల్స్ కు తీసుకువచ్చారు. వరుసగా 48 గంటలు ఎక్కిళ్ళు ఆగిపోకపోయే సరికి కరోనాను పరీక్షలు జరుపగా పాజిటివ్ గా తేలింది. ఇక, దీంతో ఇలాగే వరుసగా నాలుగు రోజులపాటు ఎక్కిళ్లు ఆగిపోకపోతే కరోనాగా అనుమానించి వైద్యుడిని సంప్రదించాలని అమెరికన్ నిపుణులు సూచిస్తున్నారు.

ఊపిరితిత్తుల జర్నల్ ప్రకారం.. రోగికి జ్వరంతో పాటు ఎక్కిళ్లు తప్ప ఏలాంటి వ్యాధి అతనికి లేదు. కానీ, అతడి ఊపిరితిత్తులు చెడిపోయి.. చాలా వాపు వచ్చిందని రిపోర్టుల్లో స్పష్టమైంది. అతనికి ఊపిరితిత్తుల వ్యాధి లేనప్పటికీ ఒక ఊపిరితిత్తి నుంచి వాపు కనిపించి రక్తస్రావం జరిగిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో అతడిని ఎమర్జెన్సీ వార్డులో చేర్చి అజిత్రోమైసిన్, హైడ్రాక్సీక్లోరోక్విన్ ఇచ్చామని.. మూడు రోజుల అనంతరం అతను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడని చికాగోలో అతడికి వైద్యం అందించిన వైద్యులు కుక్ కంట్రీ హెల్త్ తెలిపింది.

చాలా చలి, జలుబు, కండరాల నొప్పి, నిరంతర తలనొప్పి, గొంతు నొప్పితో వణుకు, వాసన లేదా రుచి తెలియకపోవడం కరోనా లక్షణాలని అమెరికా ప్రభుత్వ అత్యున్నత వైద్య సంస్థ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. జ్వరం, దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటివి కరోనా ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలని తొలుత సీడీసీ చెప్పింది. ఇక తాజాగా శాస్త్రవేత్తలు సూచిస్తున్నట్లు ఆగకుండా వచ్చే ఎక్కిళ్లు కూడా కరోనా లక్షణంగా భావించవచ్చని సైంటిస్టులు సూచిస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu