ప్రియుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియురాలు

ప్రియుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియురాలు

కృష్ణా జిల్లాలో దారుణ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్రేమించిన ప్రియురాలే ప్రియుడిపై హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డింది. అత‌డిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది.

Jyothi Gadda

|

Apr 13, 2020 | 2:13 PM

కృష్ణా జిల్లాలో దారుణ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్రేమించిన ప్రియురాలే ప్రియుడిపై హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డింది. అత‌డిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. జ‌రిగిన ఘ‌ట‌న‌పై స్థానికులు పోలీసులు ఫిర్యాదు చేయ‌గా, స‌ద‌రు యువ‌తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  వివ‌రాల్లోకి వెళితే..
కృష్ణా జిల్లాలోని ముత్యాలంపాడు గ్రామానికి చెందిన వెంక‌టేశ్వ‌ర రావు అనే యువ‌కుడిపై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. వెంక‌టేశ్వ‌ర్ రావు ప్రేమించిన యువ‌తే అత‌డిపై పెట్రోల్ పోసి నిప్పంటింది. ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగిందో తెలియ‌దు గానీ, పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డిన వెంక‌టేశ్వ‌ర్ రావు ప‌రిస్థితి విష‌మంగా ఉంది. స్థానికుల సాయంతో అత‌న్ని ఆస్ప‌త్రిలో చేర్పించారు. 70శాతం కాలిన గాయాల‌తో  అత‌డు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. జ‌రిగిన ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు..నిందితురాలిని అదుపులోకి తీసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu