బాలికను చంపి రక్తం తాగిన మేనత్త

ఆరేళ్ల బాలికను ఆమె మేనత్త అయిన వంతాల రస్మో చంపి రక్తం తాగిన ఘటన విశాఖ మన్యంలో చోటు చేసుకుంది. భర్తతో గొడవల కారణంగా రస్మో గత నెల రోజులుగా అతని తమ్ముడి ఇంట్లో ఉంటోంది. ఈ వ్యవహారం ఎటూ తేలకపోవడంతో ఆమె తమ్ముడి భార్య ఆగ్రహం వ్యక్తం చేసి రస్మోను వాళ్ల అత్తింటికి వెళ్లాలని చెప్పింది. దీంతో ఆగ్రహించిన రస్మో, తమ్ముడి కూతురునైన అనిత(6)ను కట్టెలు కొట్టడానికి వెళ్దాం అని తీసుకెళ్లి దారుణంగా హతమార్చింది. కట్టెలు […]

బాలికను చంపి రక్తం తాగిన మేనత్త

ఆరేళ్ల బాలికను ఆమె మేనత్త అయిన వంతాల రస్మో చంపి రక్తం తాగిన ఘటన విశాఖ మన్యంలో చోటు చేసుకుంది. భర్తతో గొడవల కారణంగా రస్మో గత నెల రోజులుగా అతని తమ్ముడి ఇంట్లో ఉంటోంది. ఈ వ్యవహారం ఎటూ తేలకపోవడంతో ఆమె తమ్ముడి భార్య ఆగ్రహం వ్యక్తం చేసి రస్మోను వాళ్ల అత్తింటికి వెళ్లాలని చెప్పింది. దీంతో ఆగ్రహించిన రస్మో, తమ్ముడి కూతురునైన అనిత(6)ను కట్టెలు కొట్టడానికి వెళ్దాం అని తీసుకెళ్లి దారుణంగా హతమార్చింది. కట్టెలు కొట్టే కత్తితో బలంగా దాడి చేయడంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది.  అనంతరం బాలిక రక్తం తాగింది. దీంతో సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు రస్మోను పట్టుకుని చెట్టుకు కట్టారు. కాగా.. రస్మో మానసిక పరిస్థితి బాలేదని అందుకే ఇలా చేసిందని పోలీసులు తెలిపారు.

Published On - 3:30 pm, Tue, 12 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu