ఇక రాష్ట్రపతికే విన్నవించుకుంటాం..
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి భవన్ కి పాదయాత్రగా బయలుదేరారు. ఆయనతో పాటు మంత్రులు, ఎంపీలు, పార్టీనేతలతో కలిసి ఢిల్లీలో ఏపీ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ కి పాదయాత్రగా వెళ్తున్నారు. మొత్తం 18 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కి అందజేయనున్నారు. మరికాసేపట్లో 11 మంది బృందంతో కలసి రాష్ట్రపతిని కలవనున్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి వెంటనే న్యాయం చేయాలని కోరనున్నట్లు తెలుస్తోంది. ఏపీకి జరిగిన అన్యాయాల్ని డిమాండ్ల రూపంలో రాస్ట్రపతికి […]

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి భవన్ కి పాదయాత్రగా బయలుదేరారు. ఆయనతో పాటు మంత్రులు, ఎంపీలు, పార్టీనేతలతో కలిసి ఢిల్లీలో ఏపీ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ కి పాదయాత్రగా వెళ్తున్నారు. మొత్తం 18 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కి అందజేయనున్నారు. మరికాసేపట్లో 11 మంది బృందంతో కలసి రాష్ట్రపతిని కలవనున్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి వెంటనే న్యాయం చేయాలని కోరనున్నట్లు తెలుస్తోంది. ఏపీకి జరిగిన అన్యాయాల్ని డిమాండ్ల రూపంలో రాస్ట్రపతికి వివరించనున్నట్టు సమాచారం. బీజేపీపై నిరసనగా సోమవారం ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్మపోరాట దీక్షను చేపట్టారు ఏపీ సీఎం చంద్రబాబు.