అరసవల్లిలో రథసప్తమి వేడుకలు ప్రార౦భ౦

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వేదపండితులు వేద మంత్రోచ్ఛారణలు, మంగళధ్వనులతో ఆదిత్యునికి మహాక్షీరాభిషేక సేవ చేశారు. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 6 గంటల వరకు వేద పండితులు స్వామి వారి మూలవిరాట్‌కు క్షీరాభిషేకం నిర్వహించారు. ఏడాదికొకసారి వచ్చే ఈ రథసప్తమి వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చారు.

Published On - 4:11 pm, Tue, 12 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu