Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కడ ఎవరు గెలిస్తే వారిదే ఏపీలో అధికారం

విజయవాడ: ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారనే రాజకీయ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా ఏపీపై ప్రత్యేక చూపు ఉంది. ఒక పక్క చంద్రబాబు, మరోపక్క జగన్ అధికారం కోసం ఢీ కొడుతున్నారు. పవన్ కళ్యాణ్ వీరికి గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే ఏపీలో గెలుపోటములను ప్రభావితం చేసే అంశాలు చాలా ఉన్నాయి. వాటిలో కీలక భూమిక మాత్రం కుల సమీకరణాలదే. టీడీపీ, వైసీపీలు కులాల […]

అక్కడ ఎవరు గెలిస్తే వారిదే ఏపీలో అధికారం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 18, 2020 | 9:48 PM

విజయవాడ: ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారనే రాజకీయ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా ఏపీపై ప్రత్యేక చూపు ఉంది. ఒక పక్క చంద్రబాబు, మరోపక్క జగన్ అధికారం కోసం ఢీ కొడుతున్నారు. పవన్ కళ్యాణ్ వీరికి గట్టి పోటీ ఇస్తున్నారు.

అయితే ఏపీలో గెలుపోటములను ప్రభావితం చేసే అంశాలు చాలా ఉన్నాయి. వాటిలో కీలక భూమిక మాత్రం కుల సమీకరణాలదే. టీడీపీ, వైసీపీలు కులాల వారీగా వ్యూహాలు రచిస్తున్నాయి. కుల సంఘాల నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఎవరి వ్యూహాలు వారికి ఉన్నప్పటికీ ఏపీలో రాజకీయపరంగా గోదావరి జిల్లాలకు మాత్రం అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇక్కడ ఎవరు పైచేయి సాధిస్తే వారే రాష్ట్రంలో అధికారంలోకి వస్తారనే నానుడి చాలా కాలంగా ఉంది. పలు ఎన్నికల్లో ఇది రుజువైంది కూడా. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు గోదావరి ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారిస్తాయి.

అయితే గోదావరి జిల్లాల్లో ఉంటుందనుకుంటున్న ప్రభావం శ్రీకాకుళం నుంచి పశ్చిమగోదావరి వరకూ  చూడొచ్చని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం అధికంగా ఉంటుంది. వీళ్లు కొన్నిసార్లు టీడీపీకి, కొన్నిసార్లు కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్నారు.

టీడీపీ, వైసీపీతో పాటు జనసేన చేస్తున్న ప్రయత్నం రాజకీయ సమీకరణాల్లో కీలకమయ్యే అవకాశముంది. గత ఎన్నికల్లో గోదావరి జిల్లాల ప్రజలు టీడీపీ వైపు మొగ్గు చూపారు. మరి ఈసారి ఎవరికి మద్దతు తెలుపుతారోననే ఆసక్తి నెలకొంది. అందుకే అటు టీడీపీ, ఇటు వైసీపీ, ఇంకోవైపు జనసేన ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. గోదావరిలో ఎవరిది పైచేయి అవుతుందో వారికే అధికారం దక్కుతుందనే మాట ఈసారి ఏ విధంగా రుజువౌతుందో వేచి చూడాల్సిందే.

GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
ఈ తేదీల్లో పుట్టిన వారికి సరిపోయే బెస్ట్ జోడీ ఎవరో తెలుసా..?
ఈ తేదీల్లో పుట్టిన వారికి సరిపోయే బెస్ట్ జోడీ ఎవరో తెలుసా..?