కిరణ్ కుమార్‌రెడ్డి వచ్చినా వెల్‌కమ్ చెబుతాం: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్
టీడీపీ నెత్తిన మరో పిడుగుపడనుంది. ఏపీ బీజేపీ నేత, ఆపార్టీ ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే రాజ్యసభలో టీడీపీ సభ్యులు నలుగురు బీజేపీలో వీలీనమైన విధంగానే లోక్‌సభ, అసెంబ్లీ, మండలిలోనూ జరగాలన్నదే తమ ఆలోచనగా చెప్పారు మాధవ్. కీలక నేతలంతా చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినా ఆహ్వానిస్తామన్నారు మాధవ్. మరోవైపు పీపీఏలపై కేంద్రం క్లీన్ చిట్ ఇచ్చిందంటూ టీడీపీ చేస్తున్న […]
టీడీపీ నెత్తిన మరో పిడుగుపడనుంది. ఏపీ బీజేపీ నేత, ఆపార్టీ ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే రాజ్యసభలో టీడీపీ సభ్యులు నలుగురు బీజేపీలో వీలీనమైన విధంగానే లోక్‌సభ, అసెంబ్లీ, మండలిలోనూ జరగాలన్నదే తమ ఆలోచనగా చెప్పారు మాధవ్. కీలక నేతలంతా చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినా ఆహ్వానిస్తామన్నారు మాధవ్. మరోవైపు పీపీఏలపై కేంద్రం క్లీన్ చిట్ ఇచ్చిందంటూ టీడీపీ చేస్తున్న ప్రచారం కరెక్ట్ కాదని మాధవ్ అన్నారు.