నల్లమల అడవుల్లో ప్రమాదం.. ఇద్దరి మృతి

నాగర్‌కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అమ్రాబాద్ మండలలోని జంగం రెడ్డిపల్లి ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివాసి చెంచులు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయారు. ఆ ఘటనలో ఇద్దరు చనిపోయారు. నల్లమల అడవుల్లోని కొండల్లో...

నల్లమల అడవుల్లో ప్రమాదం.. ఇద్దరి మృతి
Follow us

|

Updated on: Jul 19, 2020 | 7:28 AM

నాగర్‌కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అమ్రాబాద్ మండలలోని జంగం రెడ్డిపల్లి ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివాసి చెంచులు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయారు. ఆ ఘటనలో ఇద్దరు చనిపోయారు. నల్లమల అడవుల్లోని కొండల్లో తేనె పట్టును దింపుతుండగా ప్రమాదానికి గురయ్యారు. ఓ కొండ చివరన ఉన్న తేనె పట్టును దింపుతున్న సమయంలో వారు ఏర్పాటు చేసుకున్న తాడు తెగిపోయింది. దీంతో వారు లోయలో పడిపోయినట్లుగా సమాచారం.

లోయలో పడిపోయినవారి వివరాలు ఇలా ఉన్నాయి. చెంచు గూడానకి చెందిన దాసరి బయన్న, దాసరి పెద్దలు, దాసరి వెంకటయ్య గుర్తించారు. తేనె తీయడానికి అడవికి వెళ్లగా ప్రమాదవశాత్తు తాడు తెగిపోయి ముగ్గురు లోయలో పడిపోయినట్లు జంగం రెడ్డిపల్లి గ్రామస్తులు తెలిపారు. ఇందులో దాసరి బయన్న (35), దాసరి పెద్దులు (28) చనిపోగా వెంకటయ్య కు కాలు విరిగినట్లు గ్రామస్తులు తెలిపారు, అంతర గంగా శివాలయానికి కిలోమీటర్ దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు, అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.